
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న స్టార్ మా ఛానెల్ రియాలిటీ షో బిగ్ బాస్ లో తొలి ఎలిమినేషన్. నిజానికి జూనియర్ స్టార్ట్ చేసిన ఈ షోకు సంబంధించి పార్టిసిపెంట్స్ విషయంలో ఆడియెన్స్ బాగా నిరాశకు గురవుతున్నారు. ఎలాగోలా నడుస్తుంది అనుకుంటుంటే మరో పక్క గొడవలు కూడా షురూ అవుతున్నాయి. ఏదేమైనా.. ఎన్టీఆర్ ఎంట్రీతో మళ్లీ బిగ్ బాస్ కు ఊపొచ్చింది.
శనివారం హంగామా చేసిన తారక్ ఆదివారం కూడా అభిమానులను అలరించాడు. ఇక ఎలిమినేషన్ ఎపిసోడ్ ను స్టార్ట్ చేసిన తారక్ ముందు హౌజ్ మేట్స్ కు ఓ టాస్క్ పెట్టేసి సరదాగా నడిపించాడు. ఇక అందరూ అన్నివిధాలుగా ఎలిమినేట్ చేసిన హౌజ్ మేట్ ఎవరు అంటే జ్యోతి అని తేలింది. నిన్నటి వరకు అంతా మహేష్ కత్తి ఎలిమినేట్ అవుతాడని అనుకున్నా.. ఆడియెన్స్ కు ఈరోజు తారక్ షాక్ ఇచ్చాడు. జ్యోతిని ఎలిమినేట్ చేసి అసలు సిసలైన ట్విస్ట్ ఇచ్చాడు. జ్యోతి ఎలిమినేషన్ హంగామా లెక్కలన్ని అలా నడిపించారు. కంటెస్టంట్స్ అందరిలో జ్యోతి మీద ఓ నెగటివ్ ఫీలింగ్ ఉంది. దీనికి కారణం గతంలో జ్యోతి కొన్ని కూడని కేసుల్లో ఇరుక్కోవడమేనని అంటున్నారు. ముఖ్యంగా నిన్న జరిగిన ఎపిసోడ్ లో జ్యోతికి ఎన్.టి.ఆర్ క్లాస్ పీకుతుంటే ముమైత్ ఖాన్ ఎంజాయ్ చేసింది.
మొత్తానికి బిగ్ బాస్ లో మొదటి ఎలిమినేటర్ గా జ్యోతి.. బిగ్ బాస్ హౌజ్ నుండి బయటకు వచ్చింది. తెలుగులో క్రేజీ రియాలిటీ షోలో పాల్గొన్నందుకు జ్యోతి కూడా బాగానే ఎంటర్టైన్ అయ్యిందని చెప్పొచ్చు. ఇక శని ఆదివారం మాత్రమే వచ్చే తారక్ అలా వచ్చి ఇలా వెళ్లినట్టయ్యింది. తారక్ వచ్చిన ఈ రెండు రోజులు బిగ్ బాస్ టాప్ ప్లేస్ లో ఉందని చెప్పొచ్చు. ఇక మున్ముందు ఎలా సాగనుందో.. తర్వాత వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి. అయితే బిగ్ బాస్ హౌజ్ ఎప్పుడైనా సర్ ప్రైజ్ ఇచ్చే అవకాశం వుందని జ్యోతికి చెప్పి మరీ పంపించాడు ఎన్టీఆర్.