Bhimaa Teaser : రాక్షసులను వేటాడే బ్రహ్మ రాక్షసుడు వచ్చాడు... ‘భీమా’ టీజర్ చూశారా!

Published : Jan 05, 2024, 04:56 PM IST
Bhimaa Teaser : రాక్షసులను వేటాడే బ్రహ్మ రాక్షసుడు వచ్చాడు... ‘భీమా’ టీజర్ చూశారా!

సారాంశం

మ్యాచో స్టార్ గోపీచంద్ Gopichand  నెక్ట్స్ సినిమా ‘భీమా’ Bheema. ఈ చిత్రం నుంచి వస్తున్న అప్డేట్స్ ఇంట్రెస్టింగ్ మారాయి. తాజాగా ఈ చిత్రం నుంచి పవర్ ఫుల్ టీజర్ విడుదలైంది.

టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ వరుస చిత్రాలతో అలరిస్తూనే వస్తున్నారు. చివరిగా ‘రామబాణం’తో అలరించారు. కానీ పెద్దగా ఆడలేకపోయిందీ చిత్రం. దీంతో నెక్ట్స్ సినిమాపై ఫోకస్ పెట్టారు. గోపీచంద్ నుంచి వస్తున్న యాక్షన్ ఫిల్మ్ ‘భీమా’ Bheema. ఈ చిత్రం విడుదలకు సిద్దమవుతోంది. ఈ సందర్భంగా యూనిట్ వరుసగా అప్డేట్స్ ను వదులుతోంది. 

తాజాగా పవర్ ఫుల్ టీజర్ ను విడుదల చేశారు. పోలీస్ ఆఫీసర్ గా అలరించబోతున్న గోపీచంద్ టీజర్ లో నయా లుక్ తో ఆకట్టుకుంటున్నారు. ఆయన అటిట్యూట్, మేనరిజం అదిరిపోయింది. కొన్ని శ్లోకాలతో ప్రారంభమైన టీజర్ ఆకట్టుకుంటోంది. ఓ ప్రాంతంలో బంధీలుగా ఉన్న వారి నుంచి కాపాడే పోలీసు అధికారిగా గోపీచంద్ ఎంట్రీ ఇస్తాడు. గంగిరెద్దుపై గోపీచంద్ మాస్ అవతారం ఫ్యాన్స్ కు పునకాలు తెప్పిస్తోంది. గోపిచంద్ హై వోల్టేజ్ అవతార్‌లో దర్శనమివ్వడం, టీజర్ కట్ సినిమాపై మరింత ఆసక్తిని రేకిస్తోంది.

ఇక ఈ చిత్రాన్ని ప్రముఖ కన్నడ దర్శకుడు ఎ హర్ష డైరెక్ట్ చేస్తున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కెకె రాధామోహన్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. యాక్షన్ ఎంటర్‌టైనర్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. గోపీచంద్ సరసన ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. భీమా సినిమాకు స్వామి జె గౌడ సినిమాటోగ్రాఫర్ కాగా, కెజిఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. యాక్షన్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో రామ్-లక్ష్మణ్, వెంకట్, డాక్టర్ రవివర్మ కొరియోగ్రఫీలో ఫైట్స్ ఉండబోతున్నాయి.ఈ సినిమాను ఫిబ్రవరి 6న విడుదల చేయబోతున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?
Bigg Boss 9 Remuneration పేదలకు పంచి పెట్టిన ఫైర్ బ్రాండ్ కంటెస్టెంట్, నెటిజన్లు ఏమంటున్నారంటే?