‘ఆరడుగుల బుల్లెట్’ నాలుగు రోజుల కలెక్షన్స్ షాకింగ్

By Surya PrakashFirst Published Oct 13, 2021, 10:40 AM IST
Highlights

నా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా కుటుంబ ప్రేక్షకులతో పాటు యువత, మాస్ మెచ్చే అంశాల్ని మేళవించారు దర్శకుడు బి.గోపాల్. అన్యాయాన్ని సహించలేని ఓ యువకుడి కథ ఇది. అతని జీవితంలో ఎదురైన అనూహ్య సంఘటనల సమాహారంగా సాగుతుంది. 

' సీటీమార్’ (Seetimaar) సక్సెస్‌ గోపిచంద్ (Gopichand) కు మరిన్ని ఆఫర్స్ తెచ్చి పెట్టిందో లేదో కానీ , అతని  పాత సినిమా  దుమ్ము దులుపుకుని రిలీజ్ అయ్యింది. 2012 లో మొదలైన ఈ సినిమా ఇప్పటికి థియోటర్స్ మొహం చూసింది. అప్పటి కథ,కథనం ఈ కాలానికి నప్పేతాయా లేదా.. ఈ సినిమా మేకింగ్ ఇప్పటి జనరేషన్ కు ఎక్కుతుందా అనే విషయాలు ప్రక్కన పెట్టి రిలీజ్ చేసేసారు. అయితే అందరూ ఊహించినట్లే ఈ సినిమా మొహం చూసేవాళ్లు కరవు అయ్యారు. కలెక్షన్స్ ఎంత వీక్ గా ఉన్నాయంటే గోపీచంద్ కెరీర్ లో ఈ మధ్యకాలంలో ఇంత ప్లాఫ్ ఎవగరు అన్నట్లు ఉన్నాయి.

 ఈ శుక్రవారం విడుదలైన ‘ఆరడుగుల బుల్లెట్’ (Aaradugula Bullet) నాలుగు రోజులు బాక్సాఫీస్ కలెక్షన్స్ (Movie Collections) విషయానికొస్తే.. కేవలం రూ. 3 కోట్ల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్‌తో విడుదలైన ఈ సినిమా నాలుగు రోజుల కలెక్షన్స్ విషయానికొస్తే.. తెలంగాణ (నైజాం) లో రూ. 29 లక్షల వసూళ్లను సాధించింది. సీడెడ్ (రాయలసీమ)లో ఈ సినిమా రూ. 18 లక్షల వసూళ్లు చేసింది. ఏపీ అన్ని ఏరియాల్లో కలిపి రూ. 0.57 లక్షలు కలెక్ట్ చేసింది. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రెండు కలిపి రూ. 1.04 కలెక్షన్స్ రాబట్టింది. రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ కలిపితే.. రూ. 5 లక్షలు మాత్రమే వసూళ్లు రాబట్టింది. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా రూ. 1 కోటి 9 లక్షలు మాత్రమే వసూళు చేసింది.
 
ఇక ఈ సినిమా రూ. 3 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్‌ చేసారు. దాంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే మరో రూ. 2 కోట్లు రాబట్టాలి. ఇప్పటికే వచ్చిన కలెక్షన్స్ చూస్తుంటే.. అంత కలెక్ట్ చేయడం కష్టమే అన్నట్టు ఉంది పరిస్థితి. దసరాకు ‘మహా సముద్రం’ సినిమాతో పాటు ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’, రాఘవేంద్రరావు ‘పెళ్లి సందడి’ సినిమాలు లైన్‌లో ఉన్నాయి. మొత్తంగా గోపీచంద్ కెరీర్‌లో ‘ఆరడుగుల బుల్లెట్’ మరో డిజాస్టర్‌గా నిలిచిపోనుంది.

Also read కాజల్‌ బండారం బయటపెడతానంటూ ఆనీ మాస్టర్‌ వార్నింగ్‌.. పీక్‌లోకి వెళ్లిన సిరితో రచ్చ .. ఎంటర్‌టైనర్‌గా సన్నీ

ఏదైమైనా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా కుటుంబ ప్రేక్షకులతో పాటు యువత, మాస్ మెచ్చే అంశాల్ని మేళవించారు దర్శకుడు బి.గోపాల్. అన్యాయాన్ని సహించలేని ఓ యువకుడి కథ ఇది. అతని జీవితంలో ఎదురైన అనూహ్య సంఘటనల సమాహారంగా సాగుతుంది. ఆద్యంతం వినోదాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రం గోపీచంద్ కెరీర్‌లోనే ఓ మైలురాయిలా నిలుస్తుందనే నమ్మకముందని అన్నారు. కానీ రిలీజ్ కు చాలా సంవత్సరాలు గడవటంతో ...అవన్ని వృధా అయ్యాయి. బాలమురుగన్ ఛాయాగ్రహణం, వక్కంతం వంశీ అందించిన కథ, అబ్బూరి రవి సంభాషణలు వంటీవేమీ ఈ సినిమాకు కలిసి రాలేదు.

Also read స్లీవ్ లెస్ ప్రాక్ లో రకుల్ కిల్లింగ్ లుక్స్... ప్రేమలో పడింది గ్లామర్ డబల్ అయ్యింది! 

ప్రకాష్‌రాజ్, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, అభిమన్యుసింగ్, చలపతిరావు, సలీంబేగ్, ఉత్తేజ్, జయప్రకాష్ రెడ్డి, ఫిరోజ్ అబ్బాస్, రమాప్రభ, సురేఖావాణి, సన, సంధ్య జనక్, మధునందన్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, ఫైట్స్: కనల్ కణ్ణన్, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్: నారాయణరెడ్డి.

click me!