ఆ అమ్మాయిల కోసం గోవా వెళితే మొత్తం రచ్చ రచ్చ.. క్రేజీ స్టోరీతో గోపి గాళ్లు గోవా ట్రిప్‌

Published : Nov 11, 2025, 08:23 PM IST
Gopi Galla Goa trip movie

సారాంశం

Gopi Galla Goa trip Movie: ఇద్దరు ఫ్రెండ్స్ గోవా ట్రిప్‌ మధ్యలో ఏమైంది? తెల్ల అమ్మాయి కోసం వాళ్లు పడ్డ కష్టాలు ఫలించాయా? చివరికి ఎలాంటి అనుభవాలను ఫేస్‌ చేశారనే కాన్సెప్ట్ తో వచ్చిన మూవీ `గోపి గాళ్ల గోవా ట్రిప్‌`. 

క్రేజీ కాన్సెప్ట్ తో గోపి గాళ్ల గోవా ట్రిప్‌ మూవీ 

సినిమా చాలా మారిపోతుంది. సినిమా ఇలానే తీయాలనే దశ నుంచి ఎలా అయినా తీయోచ్చనే స్థితికి చేరుకుంది. కమర్షియల్‌ మూవీతోపాటు నేటివిటీని ఆవిష్కరించే మూవీస్‌ అడపాదడపా వస్తూనే ఉన్నాయి. వీటితోపాటు సమాంతర సినిమా మనుగడ సాధిస్తూనే ఉంది. అయితే ఇటీవల అలాంటి సినిమాల జోరు పెరిగింది. అందులో భాగంగా ఇప్పుడు `గోపి గాళ్ల గోవా ట్రిప్‌` అనే సినిమా రాబోతుంది. ఆ మధ్య ఈ చిత్ర టీజర్‌ విడుదలై ఆకట్టుకుంది. చాలా క్రేజీగా ఉంది. తెల్ల పిల్ల కోసం అని గోవా వెళ్లిన ఇద్దరు కుర్రాళ్లు అక్కడ ఫేస్‌ చేసిన పరిస్థితుల నేపథ్యంలో ఆద్యంత కామెడీగా ఈ సినిమాని రూపొందించినట్టు ఈ టీజర్‌ చూస్తే అర్థమవుతుంది.

గోపి గాళ్ల గోవా ట్రిప్‌ మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌

తెలుగులో ఇండిపెండెంట్ ఫిలిం మేకర్స్ రోహిత్, క్యాంప్ శశి గురించి ప్రత్యేకించి పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు. వీళ్లు చేసిన ఎన్నో ఇండిపెండెంట్ ఫిలిమ్స్ కి మంచి ఫ్యాన్ బేస్ ఉంది. చాలామంది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ దర్శక నిర్మాతలు కూడా వీళ్ళ వర్క్ చూసి ఫిదా అవుతుంటారు. `స్టోరీ డిస్కషన్స్`, `నిరుద్యోగ నటులు` వంటి సిరీస్ వీళ్లకు మంచి పేరు తీసుకొచ్చాయి. ఇక ప్రస్తుతం రోహిత్ శశి దర్శకత్వం వహించిన `గోపిగాళ్ల గోవా ట్రిప్`తో వస్తున్నారు. ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో మంగళవారం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌కి డైరెక్టర్ రోహిత్, శశి , మ్యూజిక్ డైరెక్టర్ రవి నిడిమర్తి. ప్రొడ్యూసర్, నటుడు సాయికుమార్, రాజు శివరాత్రి, అజిత్ మోహన్, సాయి కుమార్, పవన్ రమేష్ హాజరయ్యారు.

చిల్డ్ బీర్‌ లాంటి మూవీ గోపి గాళ్ల గోవా ట్రిప్‌

డైరెక్టర్ రోహిత్ అండ్ శశి మాట్లాడుతూ, ఈ సినిమాకి మొత్తం ముగ్గురు ప్రొడ్యూసర్లు, ఈ సినిమాను మొదటిసారి మొదలుపెట్టారు. ఈ ఐడియా చెప్పిన 15వ రోజు షూటింగ్ లో ఉన్నాం. గద్వాల్ డిస్ట్రిక్ట్ లోని ఒక రిమోట్ విలేజ్ లో ఈ షూటింగ్ స్టార్ట్ అయింది. ఇది ఒక రకమైన రూట్ ఫిల్మ్. హైవే మీద ట్రావెల్ చేస్తూ గోవా దాకా వెళ్లే దారి మధ్యలో షూటింగ్ చేశాం. ఎక్కడ పర్మిషన్ లు కూడా లేవు. సినిమా 90% సినిమా అవుట్ డోర్ లోనే ఉంటుంది. ఇది చాలా మెమొరబుల్ షూట్. ఈ సినిమా చిల్డ్ బీర్ లాంటి మూవీ` అని అన్నారు. పుష్ప ఫేమ్ జగదీష్ (కేశవ) మాట్లాడుతూ, నాకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది `నిరుద్యోగ నటులు` వెబ్ సిరీస్. దానికి రోహిత్, శశి దర్శకత్వం వహించారు. ఆ తర్వాత `పుష్ప` సినిమా విపరీతమైన గుర్తింపు తెచ్చింది. ఈ సినిమా నవంబర్ 14న విడుదలవుతుంది. అందరూ చూసి ఎంకరేజ్ చేయండి` అని అన్నారు.

ఇండిపెండెంట్‌ మూవీస్‌లో మాగ్నమ్‌ఓపస్

నటుడు సాయికుమార్ మాట్లాడుతూ, ఈ సినిమా అనేది ఇండిపెండెంట్ ఫిలిమ్స్ లో మాగ్నమోపస్ లాంటిది` అని అన్నారు. 'గోపి గాళ్ల గోవా ట్రిప్' సినిమాను రాస్తా ఫిల్మ్స్, ఔరా ఉలిస్ ఆర్ట్స్, అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్, అవంతి సినిమా సంయుక్తంగా నిర్మించారు. అజిత్ మోహన్, రాజు శివరాత్రి, క్యాంప్ శశి, సాయి కుమార్, పవోన్ రమేష్, మోనిక బుసం.. పలువురు కీలక పాత్రల్లో నటించారు. సాయి కుమార్, సీతా రామరాజు, రమణా రెడ్డి నిర్మాణంలో రోహిత్ & శశి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. నవంబర్ 14న ఏ సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది.

 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

2025 Google లో ఎక్కువగా సెర్చ్ చేసిన 10 ఇండియన్ సినిమాలు
Rajamouli కి పోటీగా.. 1000 కోట్లతో శంకర్ సినిమా, ఎప్పుడు స్టార్ట్ కాబోతోంది? హీరో ఎవరు?