
అందాల నటి సావిత్రి జీవిత నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం మహానటి. కీర్తి సురేష్, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, సమంత ప్రధాన పాత్రలలో రూపొందిన ఈ చిత్రం మే 9న విడుదల కానుంది. అయితే చిత్రంలో మధురవాణి పాత్ర పోషించిన సమంత నెటిజన్స్‌కి ఛాలెంజ్ విసిరింది. 'మాయా బజార్'లోని ‘అహ నా పెళ్లంట.. ఓహో నా పెళ్లంట’ పాటకు తమదైన శైలిలో నృత్యం చేసి నన్ను మెప్పిస్తే వారికి గిఫ్ట్‌లు ఇస్తానని సమంత ప్రకటించింది. మహానటి ఫన్ ఛాలెంజ్ పేరిట మొదలైన ఈ పోటీకి నెటిజన్స్ నుండి మంచి స్పందన వస్తోంది. చిన్న పిల్లలు పెద్దవాళ్ళు ‘అహ నా పెళ్లంట.. ఓహో నా పెళ్లంట’ పాటకు డ్యాన్స్ చేస్తూ ఆ వీడియోలను తీసి #celebrateSavitri ట్యాగ్‌చేసి ట్విట్టర్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు. ఇందులో తనకి నచ్చిన కొన్ని వీడియోలని సమంత షేర్ చేస్తూ రీట్వీట్ చేసింది.