ట్రైన్ లోనే ఘాటు రోమాన్స్.. ప్రయాణికులు ఏం చేశారో తెలుసా.?

Published : May 03, 2018, 10:55 AM IST
ట్రైన్ లోనే ఘాటు రోమాన్స్..  ప్రయాణికులు ఏం చేశారో తెలుసా.?

సారాంశం

ట్రైన్ లోనే ఘాటు రోమాన్స్..  ప్రయాణికులు ఏం చేశారో తెలుసా.?

మెట్రో రైల్లో ఓ జంటను తోటి ప్రయాణికులు చితకబాదారు. ఓ స్టేషన్లో వారిని కిందకు లాగేసి యువకుడిపై పిడిగుద్దులు కురిపించారు. ప్రయాణికుల ఆగ్రహానికి కారణం.. మెట్రో రైలు బోగీలో వారు పబ్లిగ్గా కౌగిలించుకోవడమే. కోల్‌కతా మెట్రో రైల్లో సోమవారం (ఏప్రిల్ 30) రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. రాత్రి 10 గంటల సమయంలో మెట్రో రైల్లో ఆ జంట శృతి మించి ప్రవర్తించింది. దీంతో పక్కనే ఉన్నవాళ్లకు చిర్రెత్తుకొచ్చింది. సహనం కోల్పోయిన సీనియర్ సిటిజన్లు, మధ్య వయసువారు ఆ జంటపై దాడి చేశారు.  మెట్రో స్టేషన్ రాగానే ఆ ఇద్దరినీ కిందికి దింపి మరీ దాడి చేశారు. యువకుడిపై పిడిగుద్దులు కురిపిస్తుంటే పక్కనే యువతి బాధితుణ్ని బిగ్గరగా పట్టుకొని రక్షించే ప్రయత్నం చేసింది.ఈ ఉదంతంపై చారిత్రక కోల్‌కతా నగరం రెండు వర్గాలుగా విడిపోయింది. కొంత మంది ఈ యువ జంట చర్యను తప్పుబడుతుండగా.. మరికొంత మంది ఆటవిక ఆలోచనల నుంచి బయటపడాలని వృద్ధులపై ఘాటు విమర్శలు చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Soundarya: చనిపోవడానికి ముందు మేనకోడలితో సౌందర్య ఏమన్నారంటే? చివరి మాటలు ఇవే
Don't Trouble The Trouble 5 Days Collections: డోంట్‌ ట్రబుల్‌ ది ట్రబుల్‌కి దారుణమైన కలెక్షన్లు.. 5 రోజుల్లో ఇంతేనా