Allu Arjun-Pushpa: తెలంగాణాలో మోదం... ఆంధ్రాలో ఖేదం, తెలుగు రాష్ట్రాల్లో పుష్ప పరిస్థితి ఇది!

Published : Dec 16, 2021, 03:48 PM IST
Allu Arjun-Pushpa: తెలంగాణాలో మోదం... ఆంధ్రాలో ఖేదం, తెలుగు రాష్ట్రాల్లో పుష్ప పరిస్థితి ఇది!

సారాంశం

తెలంగాణాలో పుష్ప సినిమాకు సానుకూల పరిస్థితులు నెలకొనగా.. ఆంధ్రప్రదేశ్ లో కొంచెం ఇబ్బందికర వాతావరణం నెలకొని ఉంది. 

ఆంధ్రప్రదేశ్ లో టికెట్స్ ధరలు తగ్గిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ జీవోను ఏపీ హైకోర్టు రద్దు చేసింది. పాత ధరలు కొనసాగించేలా థియేటర్స్ కి అనుమతి ఇవ్వడం జరిగింది. ఇక బెనిఫిట్ షోలకు మాత్రం కోర్ట్ అనుమతి ఇవ్వలేదు. టికెట్స్ ధరల తగ్గింపు జీవో రద్దు చేసినప్పటికీ సందిగ్దత వీడలేదు. ఏపీ ప్రభుత్వం హైకోర్టు తీరుపై అప్పీల్ చేయడం జరిగింది. ఈ అప్పీల్ విచారణ హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. దీనితో సాధారణ ధరలతోనే ఏపీలో టికెట్స్ బుకింగ్స్ జరగనుంది. అలాగే నిబంధనలకు విరుద్ధంగా అదనపు షోలు వేసిన థియేటర్స్ సీజ్ చేయనున్నట్లు ఏపీ ప్రభుత్వం కఠిన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. 

మరోవైపు తెలంగాణలో టికెట్స్ ధరల విషయంలో చిత్ర పరిశ్రమ సంతృప్తి కరంగా ఉంది. అలాగే పుష్ప (Pushpa)మూవీకి అదనంగా 5వ షో ప్రదర్శించుకునే అనుమతి ఇస్తూ ప్రభుత్వం మెమో జారీ చేస్తుంది. డిసెంబర్ 17 నుంచి 30 వరకు రోజుకు ఐదు షోలు ప్రదర్శించుకునేలా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో నైజాంలో పుష్ప భారీ ఓపెనింగ్స్ దక్కించుకునే వెసులుబాటు ఏర్పడింది. ఐదవ షోకి సంబంధించిన బుకింగ్స్ ఓపెన్ కానున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్ సీస్ లో పుష్ప ఓపెనింగ్స్ పరంగా దుమ్ముదులుపుతుంది. ముఖ్యమంగా ఓవర్ సీస్ లో ఊహకు మించిన రెస్పాన్స్ దక్కుతుంది. 

అయితే హిందీలో ఓపెనింగ్స్ ఆశాజనకంగా లేవని సమాచారం. అక్కడ కనీస ప్రమోషన్స్ నిర్వహించకపోవడమే దీనికి కారణం. ఏదో హడావిడిగా రిలీజ్ కి ఒక రోజు ముందు పుష్ప టీమ్ అక్కడ ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. అయితే హిట్ టాక్ తెచ్చుకున్న నేపథ్యంలో వసూళ్లు పుంజుకునే అవకాశం కలదు. 

కన్నడ తో పాటు కేరళలో పుష్ప అనుకోని సమస్యలు ఎదుర్కొంటుంది. ఎప్పటిలాగే కన్నడ ప్రేక్షకులు బ్యాన్ పుష్ప అంటూ అనవసర రాద్ధాంతం చేస్తున్నారు. గతంలో కూడా తెలుగు చిత్రాల విషయంలో కన్నడ ప్రేక్షకులు ఇదే తరహా వ్యతిరేకత కనబరిచారు. ఇలా అనేక ప్రతికూలతల మధ్య పుష్ప ఐదు భాషలలో విడుదలకు సిద్ధమైంది. 

Also read Pushpa First Review: పుష్ప ఫస్ట్ రివ్యూ వచ్చేసింది... ఫ్యాన్స్ సంబరాలకు సిద్ధమవ్వండి!
పుష్ప ప్రీమియర్స్ మరికొన్ని గంటల్లో యూఎస్ థియేటర్స్ లో పడనున్నాయి. అల్లు అర్జున్ (Allu Arjun)నటించిన ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కావడంతో అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. రెడ్ శాండల్ స్మగ్లింగ్ నేపథ్యంలో దర్శకుడు సుకుమార్ పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా పుష్ప తెరకెక్కించారు. దేవీశ్రీ సంగీతం అందించగా.. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించారు. రష్మిక మందాన (Rashmika Mandanna)అల్లు అర్జున్ కి జంటగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఆమె ఈ మూవీలో డీగ్లామర్ రోల్ చేస్తున్నారు. 

Also read 'Pushpa'కు అడుగడుగునా అడ్డంకులే.. కేరళ పోలీసులకే దిమ్మతిరిగింది, వీళ్లిద్దరి కష్టం అంతా ఇంతా కాదుగా


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Dhurandhar Collections: బాక్సాఫీసు వద్ద `ధురంధర్‌` కలెక్షన్ల సునామీ.. తెలుగు ఆడియెన్స్ కి గుడ్‌ న్యూస్‌
రూ. 50 లక్షలతో తీస్తే రూ. 100 కోట్లు వచ్చింది.. దుమ్మురేపిన ఈ చిన్న సినిమా ఏంటో తెలుసా.?