ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్!

Published : Oct 02, 2018, 09:50 AM IST
ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్!

సారాంశం

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తోన్న తాజా చిత్రం 'అరవింద సమేత'. త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన సరైన ప్రమోషన్స్ ని నిర్వహించలేదు చిత్రబృందం. ఇప్పుడు సినిమాను ప్రమోట్ చేయడంపైనే దృష్టి పెట్టింది. 

ఈరోజు సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా నిర్వహించనుంది. ఈ వేడుక కోసం అభిమానులు ఆసక్తిగా ఎదుచుస్తున్నారు. ఇదే వేడుకలో సినిమా ట్రైలర్ ని విడుదల చేయబోతుంది చిత్రబృందం. ఈ మేరకు అఫీషియల్ పోస్టర్ ని విడుదల చేశారు.

అక్టోబర్ 2న రాత్రి 8 గంటల 10 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. దీంతో అభిమానుల ఆనందం రెట్టింపయింది. ఇప్పటికే ఈ వేడుకకు అతిథిగా బాలకృష్ణ వస్తున్నాడని చెప్పి అభిమానులను ఖుషీ చేసిన చిత్రయూనిట్ ఇప్పుడు థియేట్రికల్ ట్రైలర్ తో మరింత రంజింపచేయబోతున్నారు.

గత కొన్నేళ్లుగా ఎన్టీఆర్‌కు దూరంగా ఉన్న బాలయ్య.. హరికృష్ణ మరణంతో మళ్లీ దగ్గరయ్యారనే వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే ఎన్టీఆర్ కోసం అతిథిగా రావడానికి సిద్ధమయ్యారు బాలయ్య. బాబాయ్, అబ్బాయ్ లను ఒకే వేదికపై చూడడానికి అభిమానులు ఆనందంగా ఎదురుచూస్తున్నారు!

PREV
click me!

Recommended Stories

ధురంధర్ 2 కి రిలీజ్ కు ముందే దెబ్బ? టాక్సిక్ హిస్టారిక్ డీల్‌తో గేమ్ మారిపోయిందిగా..
Allu Arjun ని కలవాలంటే 42 రూల్స్ ? ఆ బ్రాండ్‌ స్ట్రాటజర్‌కి ఇచ్చిపడేసిన అల్లు అర్జున్‌ టీమ్‌