Good Luck Sakhi : ‘సఖి’ వచ్చేస్తోంది... రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు..

By team teluguFirst Published Jan 21, 2022, 5:35 PM IST
Highlights

గత కొంత కాలంగా ఎప్పుడెప్పుడు  రిలీజవుతుందా అని ఎదురుచూసిన సినిమాల్లో ‘గుడ్ లక్ సఖి’ మూవీ కూడా ఒకటి ‘మహానటి’తో  తన నటనా శైలితో మెప్పించిన కీర్తి సరేష్, గుడ్ లక్ సఖి మూవీలోనూ లీడ్ రోల్ చేసింది. కాగా ఈ నెలలోనే మూవీని రిలీజ్ చేయనున్నారు. 
 

ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా డిసెంబర్ 10న విడుదల కావాల్సి ఉండేది. కానీ అనుహ్యా కారణాల వల్ల వాయిదా వేస్తూ వచ్చారు  మూవీ  మేకర్స్. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‏ను ప్రకటించింది చిత్రయూనిట్. ఈ నెలలోనే రిలీజ్ చేయనున్నట్టు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. 

కీర్తి సురేష్ (Keerthy Suresh)సోలోగా నటించిన  'గుడ్ లక్ సఖి' (Good Luck Sakhi) షూటింగ్ ను, పోస్ట్ ప్రోడక్షన్ పనులను కూడా పూర్తి చేసుకొని  రిలీజ్ కు రెడీ అయ్యింది. వాయిదాలు మీద వాయిదాలు పడుతూ వచ్చిన ఈ సినిమాను  ‘జనవరి 18’ రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు.  

ఈ సినిమాలో ఆది పినిశెట్టి, జగపతి బాబు కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. గుడ్ లక్ సఖి సినిమాను ప్రముఖ నిర్మాత దిల్‌రాజు సమర్పణలో ‘వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్’ బ్యానర్ పై సుధీర్ చంద్ర ప‌దిరి నిర్మిస్తున్నారు. నగేష్ కుకునూరు సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, పోస్టర్స్‏కు మంచి రెస్పాన్స్ వచ్చింది.  ఇందులో ఆది పినిశెట్టి, జగపతి బాబు, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం కీర్తి సురేష్‌కు ఎలాంటి సక్సెస్ ఇస్తుందో చూడాలి. 

టాలీవుడ్ లో ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ అయ్యిపోయి రిలీజ్ కి రెడీ అయ్యిన సినిమాలు చాలానే ఉన్నాయి. వాటిలో ఒక్కొక్కటిగా ఇప్పుడు రిలీజ్ అవుతూ వస్తున్నాయి కూడా. మరి అలాంటి చిత్రాల్లో ఒకటైన మరో చిత్రం ఇప్పుడు రిలీజ్ కి రెడీ అయ్యిన మూవీనే ‘గుడ్ లక్ సఖి’. ఎట్టకేళలకు మూవీ రిలీజ్ కు రెడీ కావడంతో ప్రేక్షకులు, కీర్తి సురేష్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నన్నారు. చిత్రం యూనిట్ ఆల్ ద బెస్ట్ చేప్తున్నారు. 

 

సఖి వచ్చేస్తొంది📢💃

Can't wait for you all to watch in the theaters near you💕 pic.twitter.com/I8dQQ6g6XZ

— Worth A Shot (@WorthAShotArts)

కాగా, ఈ చిత్ర దర్శకుడు నగేష్ కుకునూరు  బాలీవుడ్ లో చాలా సినిమాలకు పనిచేశారు. డైరెక్షన్, ప్రోడ్యూసర్, స్క్రీన్ రైటర్, యాక్టర్ గా తన ప్రతిభ చాటాడు. ఈయన 1998లో తీసిన ‘హైదరాబాద్ బ్లూస్’ మూవీ మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది. అప్పటి నుంచి వరుసగా పలు చిత్రాలను నిర్మిస్తూ, దర్శకత్వం వహిస్తూ వస్తున్నారు. 

తాజాగా విడుదలకు రిలీజ్ కు సిద్ధంగా ఉన్న ‘గుడ్ లక్ సఖి’మూవీకి దర్శకత్వం వహించారు. అయితే తెలుగులో ఇది ఈయనకు మొదటి సినిమా. 
ఈ మూవీతోనే తెలుగు ప్రేక్షకులకు తన దర్శకత్వ స్కిల్స్  ను చూపించనున్నారు. అయితే మహానటి మూవీలో నటించిన కీర్తి సురేష్ ను చూసిన  డైరెక్టర్ తన సినిమాకు ఎంపిక చేశారట. టాలీవుడ్ హీరోయిన్ల రేసులో ఉన్న కీర్తి సురేష్ ఈ మూవీతో మరింత ముందుకెళ్లనున్నారు. త్వరలో కీర్తి నటించిన ‘సర్కారు వారి పాట’ మూవీ కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది.  

click me!