సూపర్‌స్టార్‌కు ఘన నివాళి.. హైదరాబాద్‌లో కృష్ణ మెమోరియల్

Siva Kodati |  
Published : Nov 17, 2022, 02:15 PM ISTUpdated : Nov 17, 2022, 02:22 PM IST
సూపర్‌స్టార్‌కు ఘన నివాళి.. హైదరాబాద్‌లో కృష్ణ మెమోరియల్

సారాంశం

హైదరాబాద్‌లో సూపర్‌స్టార్ కృష్ణ మెమోరియల్‌ను ఏర్పాటు చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. మెమోరియల్‌లో కృష్ణ కాంస్య విగ్రహంతో పాటు ఆయన నటించిన 350 సినిమాలకు సంబంధించిన ఫోటోలు , షీల్డ్‌లు, ఇతర వివరాలను ప్రజలకు అందుబాటులో వుంచనున్నారు.

హైదరాబాద్‌లో సూపర్‌స్టార్ కృష్ణ మెమోరియల్‌ను ఏర్పాటు చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. అయితే ఎక్కడ ఏర్పాటు చేయాలనేదానిపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు. మెమోరియల్‌లో కృష్ణ కాంస్య విగ్రహంతో పాటు ఆయన నటించిన 350 సినిమాలకు సంబంధించిన ఫోటోలు , షీల్డ్‌లు, ఇతర వివరాలను ప్రజలకు అందుబాటులో వుంచనున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.  

కాగా.. అనారోగ్యంతో మరణించిన తెలుగు సినీ దిగ్గజం, సూపర్‌స్టార్ కృష్ణ అంత్యక్రియలు తెలంగాణ ప్రభుత్వ అధికార లాంఛనాలు , అశేష అభిమానుల అశృునయనాల మధ్య బుధవారం మహాప్రస్థానంలో ముగిసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పోలీసులు గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపి కృష్ణకు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం కృష్ణ కుమారుడు మహేశ్ బాబు తండ్రి చితికి తలకొరివి పెట్టారు. 

మంగళవారంనాడు తెల్లవారుజామున గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ కృష్ణ మరణించారు. దీంతో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కృష్ణ పార్థీవదేహనికి నివాళులర్పించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ , ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఏపీ సీఎం వైఎస్ జగన్ తదితరులు కృష్ణ భౌతికకాయానికి నివాళులర్పించారు.

PREV
click me!

Recommended Stories

Eesha Rebba: తరుణ్‌ భాస్కర్‌ చెంప చెల్లుమనిపించిన ఈషా.. మార్షల్‌ ఆర్ట్స్ నేర్చుకుని మరీ ప్రతీకారం
Padma Awardsపై మురళీ మోహన్‌, రాజేంద్రప్రసాద్‌ ఎమోషనల్‌ కామెంట్‌.. చిరంజీవి సత్కారం