మెగా పవర్ స్టార్ కోసం 15 కోట్ల బడ్జెట్ తో సాంగ్..?

By Mahesh Jujjuri  |  First Published Nov 17, 2022, 1:02 PM IST

రామ్ చరణ్ - శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న RC15 మూవీ గురించి  రోజుకో న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ మధ్య వరుసగా ఈ సినిమాపై వార్తలు వస్తున్నాయి.  ఈక్రమంలో చరణ్ సినిమా గురించి మరో న్యూస్ హల్ చల్ చేస్తుంది. 


రామ్ చరణ్ - శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న RC15 మూవీ గురించి  రోజుకో న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ మధ్య వరుసగా ఈ సినిమాపై వార్తలు వస్తున్నాయి.  ఈక్రమంలో చరణ్ సినిమా గురించి మరో న్యూస్ హల్ చల్ చేస్తుంది. 

రామ్‌ చరణ్‌ హీరోగా నటిస్తున్న Rc15 సినిమా గురించి  ఆశ్చర్యపరిచే విషయాలు బయటకు వస్తున్నాయి. ఇప్పటికే  శంకర్‌ డైరెక్ట్ చేస్తున్న ఈసినిమాకు సబందించి రకరకాల వార్తలు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. దర్శకత్వంలో పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి అవుతున్న టైమ్ లో బ్రేక్ ఇచ్చి అందికి షాక్ ఇచ్చాడు దర్శకుడు. ఇక ఇప్పుడు ఫారెన్ షెడ్యూల్ తో ఈమూవీ మళ్లీ రీ ఓపెన్ అవ్వబోతోంది. 

Latest Videos

దిల్‌ రాజు నిర్మిస్తున్న ఈసినిమాలో  కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. చరణ్ - కియారా కాంబినేషన్ లో ఇది రెండో సినిమా కావడం విశేషం. ఇక ఈక్రమంలోనే  ఈమూవీ గురించి మరో సెన్సేషనల్ న్యూస్ ఒకటి వయటకు వచ్చింది.  ఈ సినిమాలోని ఓ పాట కోసం 15 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారనే వార్త ఇండస్ట్రీ నీ షేక్ చేస్తోంది. అంతే కాదు ఈ పాట కోసం దాదాపు 12 రోజుల ప్లాన్ చేశారట. చాలా జాగ్రత్తగా ఈ పాటను చిత్రీకరించబోతున్నట్టు తెలుస్తోంది.  

ఈ పాట కోసం అంత భారీ ఖర్చు చేస్తున్నట్లు చెబుతున్నారు. ఇక శంకర్‌ సినిమా గురించి అందరికి తెలిసిందే.. ఆయన సినిమాలకు ఎంత భారీగా ఖర్చు చేశాడు. ఎంత గ్రాండ్ నెస్ ఉంటుంతో తెలుసు.  ఇక ఈమూవీ కోసం కూడా అంతే గ్రాండ్ నెస్ ను ప్లాన్ చేస్తున్నాడట స్టార్ డైరెక్టర్ . ఈక్రమంలోనే 15 కోట్ల పాట ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఈ మూవీ  షూటింగ్ కూడా అంతే గ్రాండ్ గా ఉండబోతున్నట్టు తెలుస్తోంది. 

కాస్ట్లీ సెట్స్.. రేర్ లొకేషన్స్.. గ్రాఫిక్స్..  ఇలా అన్నింట భారీ ఖర్చుతో ఈ పాట ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అరుదైన లొకేషన్స్‌, గ్రాఫిక్స్‌తో శంకర్ ఈ పాట ప్లాన్ చేస్తున్నారట.   పొలిటికల్‌ థ్రిల్లర్‌ కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది వేసవికి విడుదల కానుంది. ఇందులో రామ్‌ చరణ్‌ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు సమాచారం. మరి ఈ పాటకు 15కోట్లు అన్న విషయంలో ఎంత వరకూ నిజం ఉందో తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. 

click me!