ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాను.. తాత కృష్ణ మరణంతో ఎమోషనల్ పోస్ట్ చేసిన గౌతమ్ కృష్ణ

Published : Nov 17, 2022, 02:05 PM IST
ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాను.. తాత కృష్ణ మరణంతో ఎమోషనల్  పోస్ట్ చేసిన గౌతమ్ కృష్ణ

సారాంశం

కృష్ణ మరణం మహేష్ తో పాటు ఘట్టమనేని ఫ్యాన్స్ ను కూడా శోక సంద్రంలో ముంచేసింది. ఈక్రమంలో ఆయన మరణం తట్టుకోలేకోయిన ఆయన మనవడు గౌతమ్ కృష్ణ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. అంతకు ముందు సితార కూడా తాత గురించి ఓ పోస్ట్ చేశారు. 

కృష్ణ మరణం మహేష్ తో పాటు ఘట్టమనేని ఫ్యాన్స్ ను కూడా శోక సంద్రంలో ముంచేసింది. ఈక్రమంలో ఆయన మరణం తట్టుకోలేకోయిన ఆయన మనవడు గౌతమ్ కృష్ణ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. అంతకు ముందు సితార కూడా తాత గురించి ఓ పోస్ట్ చేశారు. 

టాలీవుడ్  స్టార్ హీరో.. తన మరణంతో ఒక శకానికి వీడ్కోలు పలికిన  హీరో నటశేఖరుడు సూపర్ స్టార్ కృష్ణ. డేరింగ్ అండ్ డాషింగ్ హీరోగా  టాలీవుడ్ ను శాసించిన కృష్ణ  మరణంతో ఆయన కుటుంబం ఫ్యాన్స్ తో పాటు..  టాలీవుడ్ కూడా  ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇక ఘట్టమనేని ఫ్యామిలీ అయితే కుటుంబంలో వరుస మరణాలకు కృంగిపోతుంది. తెలంగాణ రాష్ట్ర అధికార లాంచనాలతో  బుధవారం అభిమానుల  మధ్య కృష్ణ అంత్యక్రియలు ముగిసాయి. 

కృష్ణ మరణాన్ని మహేష్ బాబుతో పాటు.. తాత దూరం అవ్వడాన్ని తట్టుకోలేకపోయారు ఆయన మనవడు గౌతమ్, మనవరాలు సితార. తమ బాధను  సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.  తాతయ్య కృష్ణ గురించి మాట్లాడుతూ ఎమోషనల్ పోస్టులు వేశారు. ఇంకీ గౌతమ్ తో పాటు సితార వేసిన పోస్ట్ ఏంటీ అంటే...? 

తాత మరణాన్ని తట్టుకోలేని మనవడు గౌతమ్, మనవరాలు సితార.. తమ సోషల్ మీడియాలో తాతయ్య కృష్ణ గురించి మాట్లాడుతూ ఎమోషనల్ పోస్టులు వేశారు. గౌతమ్.. నువ్వు ఎక్కడ ఉన్నా, నేను నిన్ను ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాను. అలాగే నువ్వు కూడా నన్ను ప్రేమిస్తుంటావని నాకు తెలుసు. నేను చెప్పలేనంతగా మిమ్మల్ని మిస్ అవుతున్న, మిస్ యూ తాత గారూ అంటూ కృష్ణతో ఉన్న ఫోటోని షేర్ చేశాడు.

 

అటు సితార కూడా తాతను తలుచుకుంటూ సితార ఈవిధంగా పోస్ట్ చేసింది.  వీకెండ్స్ లో లంచ్ మళ్ళీ ఎప్పటిలా ఉండదు. నువ్వు నాకు చాలా విలువైన విషయాలు నేర్పావు. ఎప్పుడూ నవ్వుతూనే ఉన్నావు. ఇప్పుడు మిగిలింది నీ జ్ఞాపకం మాత్రమే. నువ్వే నా హీరో. ఏదో ఒక రోజు నిన్ను గర్వపడేలా చేయగలనని ఆశిస్తున్నాను. నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను తాత గారూ” అంటూ ఇన స్టాలో పోస్ట్ చేసింది. ఇక ఈ పోస్ట్ చేయడంతో ఘట్టమనేని ఫ్యామిలతో పాటు.. ఫ్యాన్స్ కూడా ఎమోషనల్ అవుతున్నారు. 


 

PREV
click me!

Recommended Stories

Sivakarthikeyan: కారు ప్రమాదం నుంచి తప్పించుకున్న శివకార్తికేయన్, నడిరోడ్డుపై గొడవ సెటిల్ చేసిన హీరో
Ashika Ranganath: దాదాపు 30 ఏళ్ళ వయసు తేడా ఉన్న ముగ్గురు హీరోలతో రొమాన్స్.. హీరోయిన్ రియాక్షన్ వైరల్