#RRRMovie:RRR థియేటర్స్ లో సినిమాతో పాటు ఈ ట్రైలర్ కూడా...

Surya Prakash   | Asianet News
Published : Mar 22, 2022, 10:51 AM ISTUpdated : Mar 22, 2022, 11:04 AM IST
#RRRMovie:RRR థియేటర్స్ లో సినిమాతో పాటు ఈ ట్రైలర్ కూడా...

సారాంశం

..డి.వి.వి దానయ్య దాదాపు రూ.350 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించాడు. ఇప్పటికే విడుదలైన ప్రతి విజువల్ సినిమాపై అంచనాలు పదింతలు పెంచేసింది.  జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లను ఓకే ఫ్రేమ్ లో చూడాలన్న వాళ్ల కలను రాజమౌళి పూర్తి చేశాడు. ఇప్పటికే విడుదలైన నాటు నాటు పాటలో ఎన్టీఆర్ (Jr NTR), చరణ్ (Ram charan), డాన్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

 

కేవలం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాదు..ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు అంతా వేచి చూస్తున్న చిత్రం త్రిబుల్ ఆర్ (RRR). రాజమౌళి  ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమాపై ఉన్న అంచనాల అంతా ఇంతా కావు. ఈ నెల 25న ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 15 వేల థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా తెలుగుతోపాటు మిగిలిన అన్ని భాషల్లో కూడా అదే స్థాయిలో విడుదల అవుతుంది ఇది. బాహుబలి తర్వాత రాజమౌళి నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ మాత్రం అంచనాలు ఉండటం ఖాయం. ఈ సినిమాతో పాటే వరుణ్ తేజ్ నటించిన ‘గని’ మూవీ ట్రైలర్ ప్రదర్శింపబడుతుంది. ఈ ట్రైలర్ మొన్న గురువారం విడుదలైంది. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 8న విడుదల కానుంది.

కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో అల్లు బాబీ, సిద్దు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఎప్పుడో విడుదల కావల్సి ఉన్నా.. కోవిడ్-19 వల్ల చాలాసార్లు వాయిదా పడింది.  ఇక ఈ ట్రైలర్ ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ కు చెందిన వెయ్యికి  పైగా థియోటర్స్ లో ప్రదర్శింపబడనుంది.

‘‘గని ఇక లైఫ్‌లో బాక్సింగ్ ఆడనని ప్రామిస్ చేయ్’’ అంటూ ‘గని’ తల్లి చెప్పే డైలాగుతో ట్రైలర్ మొదలువుతుంది. కానీ, తల్లి మాట వినకుండా గని బాక్సింగ్ కొనసాగిస్తాడు. ‘‘ఒక వేళ అమ్మకు నిజం తెలిసే రోజే వస్తే.. అది నేను నేషనల్ ఛాంపియన్ అయిన రోజువ్వాలి. అదే నా గోల్’’ అని గని చెబుతాడు. మరి, గని లక్ష్యం నెరవేరుతుందా? నేషనల్ ఛాంపియన్‌గా నిలిచి తల్లి ముందు నిలుచుంటాడా? తన లక్ష్యాన్ని చేరుకొనే క్రమంలో అతడికి ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయి. తదితర అంశాలను ట్రైలర్‌లో చూపించారు. ఈ చిత్రంలో వరుణ్ తేజ్‌కు తల్లిగా నదియా నటించారు. జగపతిబాబు, సునీల్ శెట్టి, ఉపేంద్ర తదితరలు పలు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ‘‘ఆట గెలవాలంటే నేను గెలవాలి. ఎందుకంటే ఈ సొసైటీ ఎప్పుడూ గెలిచినవాడి మాటే నమ్ముతుంది’’ అనే డైలాగ్ బాగుంది. మొత్తానికి ఈ ట్రైలర్ మెగా ఫ్యామిలీ అభిమానులకు బాగా నచ్చేస్తుంది.

ఇక ఆర్ ఆర్ ఆర్ విషయానికి వస్తే...డి.వి.వి దానయ్య దాదాపు రూ.350 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించాడు. ఇప్పటికే విడుదలైన ప్రతి విజువల్ సినిమాపై అంచనాలు పదింతలు పెంచేసింది.  జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లను ఓకే ఫ్రేమ్ లో చూడాలన్న వాళ్ల కలను రాజమౌళి పూర్తి చేశాడు. ఇప్పటికే విడుదలైన నాటు నాటు పాటలో ఎన్టీఆర్ (Jr NTR), చరణ్ (Ram charan), డాన్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మొన్న విడుదలైన జనని పాటకు కూడా అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. అలాగేట్రైలర్ విడుదలకు కూడా అద్బుతమైన రెస్పాన్స్ వచ్చింది.

 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: తనూజకి షాక్‌.. కళ్యాణ్‌ సీక్రెట్‌ క్రష్‌ బయటపెట్టిన ఇమ్మాన్యుయెల్‌
Dhurandhar Collections: బాక్సాఫీసు వద్ద `ధురంధర్‌` కలెక్షన్ల సునామీ.. తెలుగు ఆడియెన్స్ కి గుడ్‌ న్యూస్‌