Ghani teaser: 'ఆడినా ఓడినా రికార్డ్స్ లో ఉంటావ్.. గెలిస్తేనే చరిత్రలో ఉంటావ్', దుమ్మురేపుతున్న వరుణ్

Published : Nov 15, 2021, 11:39 AM IST
Ghani teaser: 'ఆడినా ఓడినా రికార్డ్స్ లో ఉంటావ్.. గెలిస్తేనే చరిత్రలో ఉంటావ్', దుమ్మురేపుతున్న వరుణ్

సారాంశం

మొదటిసారి వరుణ్ ఓ స్పోర్ట్స్ డ్రామాలో నటిస్తుండగా, గని టీజర్ అదిరిపోయింది. చరణ్ వాయిస్ ఓవర్ తో సాగిన ఈ టీజర్ లో వరుణ్ లుక్, విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి.

కెరీర్ బిగినింగ్ నుండి విభిన్నమైన జోనర్స్ ఎంచుకుంటూ ప్రత్యేకత చాటుకుంటున్నారు వరుణ్ తేజ్ (Varun tej). ఆయన గత చిత్రం గద్దలకొండ గణేష్ సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకోగా, వరుణ్ నెగిటివ్ షేడ్స్ లో కనిపించడం విశేషం. కాగా వరుణ్ మరో ప్రయోగాత్మక చిత్రంతో  ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. వరుణ్ లేటెస్ట్ మూవీ గని లో ఆయన ప్రొఫెషనల్ బాక్సర్ రోల్ చేస్తున్నారు . 


దర్శకుడు కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ పెద్ద కుమారుడు అల్లు వెంకటేష్ నిర్మిస్తున్నారు. సిద్దు ముద్ద మరో నిర్మాతగా ఉన్నారు. గని (Ghani) చిత్రం కోసం వరుణ్ కఠిన కసరత్తులతో కండల తిరిగి దేహం సాధించాడు. సహజత్వం కోసం వరుణ్ ప్రొఫెషనల్ బాక్సర్స్ వద్ద శిక్షణ తీసుకోవడం జరిగింది. ఇక విడుదలైన ప్రోమోలు మూవీపై పాజిటివ్ బజ్ క్రియేట్ చేశాయి. 


కాగా నేడు విడుదలైన టీజర్ (Ghani teaser) సినిమాపై అంచనాలు మరో స్థాయికి  చేర్చింది. నిమిషానికి పైగా ఉన్న టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ప్రతివాడికి గెలవాలనే కోరిక ఉంటుంది... కానీ ఒక్కడే ఛాంపియన్ అవుతాడు. ఆ ఒక్కడు నువ్వే ఎందుకు కావాలి... అని చరణ్ వాయిస్ ఓవర్ వస్తుంటే విజువల్స్ అదిరిపోయాయి. గెలవాలని అందరికీ ఉంటుంది, కష్టపడినోడికే ఫలితం ఉంటుంది. ప్రత్యేకత ఉన్నోడే పైకి వస్తాడు, నీలో ఉన్న ఆ ప్రత్యేకత ఏమిటీ? అని అర్థం వచ్చేలా గని టీజర్ లో చరణ్ (Ram charan) డైలాగ్స్ ఉన్నాయి. ''ఆట ఆడినా ఓడినా రికార్డ్స్ లో ఉంటావ్.. కానీ గెలిస్తేనే చరిత్రలో ఉంటావ్..' అనే చరణ్ డైలాగ్ తో టీజర్ ముగిసింది. 

Also read Ghani teaser: గని టీజర్ లో చరణ్ వాయిస్ ఓవర్
అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలతో పాటు, కట్టిపడేసే ఎమోషన్స్ ప్రధానంగా గని మూవీ తెరకెక్కినట్లు టీజర్ తో తెలియజేశారు. ఇక నదియా వరుణ్ తల్లిగా కనిపిస్తుండగా, సునీల్ శెట్టి ప్రధాన విలన్ గా నటించే అవకాశం కలదు. థమన్ బీజీఎమ్ టీజర్ లో మరో ప్రధాన ఆకర్షణ అని చెప్పాలి. 

Also read 2010లో ఆగిపోయిన రాంచరణ్, కాజల్ మూవీ.. మెగా పవర్ స్టార్ డ్రీమ్ నెరవేరబోతోంది
మరోవైపు స్టార్ క్యాస్ట్ గని చిత్రంలో భాగమయ్యారు. బాలీవుడ్ బ్యూటీ సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తుండగా, జగపతి బాబు, ఉపేంద్ర, నరేష్, తనికెళ్ళ భరణి కీలక రోల్స్ లో నటిస్తున్నారు. మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నారు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది గని చిత్రం.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 Winner Fix: బిగ్‌ బాస్‌ విన్నర్‌ ముందే ఫిక్స్.. అదే జరిగితే సరికొత్త హిస్టరీకి శ్రీకారం
Sara Arjun: ధురంధర్ స్టార్ సారా అర్జున్ రూ.12 కోట్ల లగ్జరీ ఫ్లాట్.. వైరల్ ఫోటోలు