శరీరంలోని ఆ ప్రైవేట్ పార్ట్ కి 13కోట్ల ఇన్సూరెన్స్... మోడల్ చేసిన పనికి షాకైన ప్రపంచం

Published : Nov 15, 2021, 09:01 AM IST
శరీరంలోని ఆ ప్రైవేట్ పార్ట్ కి 13కోట్ల ఇన్సూరెన్స్... మోడల్ చేసిన పనికి షాకైన ప్రపంచం

సారాంశం

ఇళ్ళు, కార్లు, ఇతర వాహనాలకు ముందస్తు జాగ్రత్తగా ఇన్సూరెన్స్ చేయించడం మనం చూశాం. అయితే ఓ మోడల్ తన శరీరంలోని ఓ ప్రైవేట్ పార్ట్ కి ఏకంగా కోట్లలో ఇన్సూరెన్స్ చేయించి, వార్తలలో నిలిచింది.   

బ్రెజిల్ కి చెందిన మోడల్ నాథీ కిహారా(Nathy kihara) తన అందానికి కారణం పిరుదులు అని భావిస్తున్నారు. తన శరీరంలో అత్యంత విలువైన భాగంగా భావిస్తున్న సదరు పిరుదుల భద్రత కోసం ఆమె సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన పిరుదులకు ఆమె ఇన్సూరెన్స్ చేయించారు. అది కూడా ఏకంగా 1.3 మిలియన్ పౌండ్లకు, మన రూపాయల్లో చెప్పాలంటే రూ. 13 కోట్ల రూపాయలకు. ఒక శరీర భాగం కోసం ఇంత పెద్ద మొత్తంలో ఇన్సూర్ చేయడం వరల్డ్ వైడ్ గా హాట్ టాపిక్ అయ్యింది. 


2021 మిస్ బుమ్ బుమ్ టైటిల్ గెలిచిన  నాథీ కిహారా  తన గెలుపుకు... పిరుదులే కారణం అని గట్టిగా నమ్ముతున్నారు. తనకు వచ్చి ఫేమ్, ఇమేజ్ వాటి వలనే అని భావిస్తున్న ఈ మోడల్ వాటి భద్రత కోసం ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. నాథీ ఈ విషయమై మాట్లాడుతూ.. నా పిరుదులు పూర్తిగా సహజమైనది. నా శరీరాన్ని కాపాడుకోవడానికి నేను చాలా శిక్షణ పొందుతున్నాను. తల్లిగా మారిన తర్వాత జిమ్‌లో బరువులు ఎత్తడం కంటే ఆహారంపై ఎక్కువ దృష్టి పెట్టడం ప్రారంభించానని చెప్పుకొచ్చింది. 

Aslo read నటిపై దాడి చేసి మొబైల్ లాక్కెళ్లిన దొంగ
ఈ 35ఏళ్ల మోడల్ ఇంకా తన పిరుదు సైజ్ పట్ల సంతృప్తిగా లేరట. మరిన్ని కసరత్తులు చేయడం ద్వారా వాటి సైజ్ పెంచాలని ఆమె దృఢ సంకల్పంతో ఉన్నారట. ఇక మోడల్ నిర్ణయాలు, ఆలోచనలు చూసిన కొందరు.. ఎవరి పిచ్చి వాళ్ళది అంటూ... కామెంట్ చేస్తున్నారు. బుర్రకో బుద్ది... జిహ్వకో రుచి అని పెద్దలు ఊరికే అన్నారా. వయసుతో పాటు తరిగిపోయే శరీరానికి కోట్ల ఇన్సూరెన్స్ చేయడం ఏమిటి మరీ విడ్డూరం కాకపోతేనూ.

Also read Pooja hegde: బికినీలో బ్రేక్ ఫాస్ట్, సముద్రంలో జలకాలు.. మాల్దీవ్స్ తీరాన్ని అందాలతో వేడెక్కిస్తున్న పూజ హెగ్డే
 

PREV
click me!

Recommended Stories

Kangana Ranaut Sarees: పార్లమెంట్ ఫ్యాషన్ అదుర్స్.. కంగనా బెస్ట్ శారీ లుక్స్ చూశారా?
Objection My Lord Review: అబ్జెక్షన్‌ మై లార్డ్ వెబ్‌ సిరీస్‌ రివ్యూ.. శ్రీకాంత్‌ కోర్ట్ రూమ్‌ డ్రామా ఎలా ఉందంటే?