గెటప్ శ్రీను ఫ్యామిలీకి చిరంజీవి సర్ ప్రైజ్.. పట్టలేని సంతోషంలో జబర్దస్త్ కమెడియన్!

pratap reddy   | Asianet News
Published : Oct 23, 2021, 08:52 PM IST
గెటప్ శ్రీను ఫ్యామిలీకి చిరంజీవి సర్ ప్రైజ్.. పట్టలేని సంతోషంలో జబర్దస్త్ కమెడియన్!

సారాంశం

గెటప్ శ్రీను జబర్దస్త్ కామెడీ షోలో వైవిధ్యమైన నటన, గెటప్పులతో మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు. సుడిగాలి సుధీర్ టీంలో శ్రీను గెటప్పులు, నటన ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకుంటుంటాయి. 

గెటప్ శ్రీను జబర్దస్త్ కామెడీ షోలో వైవిధ్యమైన నటన, గెటప్పులతో మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు. సుడిగాలి సుధీర్ టీంలో శ్రీను గెటప్పులు, నటన ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకుంటుంటాయి. పలు సందర్భాల్లో మెగా బ్రదర్ నాగబాబు శ్రీను నటనని ప్రశంసించారు. అలాగే శ్రీను మెగాస్టార్ చిరంజీవిని ఇమిటేట్ చేస్తూ పలు స్క్రిప్ట్స్ చేశాడు. 

అలా Getup Srinu మెగా ఫ్యామిలీని అభిమానించే వ్యక్తి. ఇక Megastar Chiranjeevi గురించి చెప్పేదేముంది.. ఇటీవల మెగాస్టార్ చిన్న పెద్ద అనే తేడా లేకుండా తనకోసం వచ్చిన ప్రతి ఒక్కరిని కలుస్తున్నారు. సినిమా ట్రైలర్ లాంచ్ , టీజర్ లాంచ్ ఇలా తనకు చేతనైన సాయం చేస్తున్నారు. కాగా గెటప్ శ్రీను కుటుంబానికి చిరంజీవి నుంచి స్వీట్ సర్ ప్రైజ్ ఎదురైంది. 

నేడు గెటప్ శ్రీను, అతడి భార్య 8వ మ్యారేజ్ యానవర్సరీ సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా గెటప్ శ్రీను ఫ్యామిలీ చిరంజీవిని కలిశారు. చిరంజీవి ఆశీస్సులు పొందడమే కాదు.. మెగాస్టార్ నుంచి కానుకలు కూడా అందుకున్నారు. చిరంజీవి గెటప్ శ్రీను దంపతులకు మ్యారేజ్ డే సందర్భంగా కేకు, స్వీట్లు, కొత్త బట్టలు అందించారు. 

Also Read: నభా నటేష్ కిరాక్ హాట్ షో.. ఎద అందాలతో మెస్మరైజింగ్ ఫోజులు

దీనితో శ్రీను పట్టరాని సంతోషంతో ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. ' థాంక్యూ సోమచ్ చిరంజీవి సర్.. ఈ మ్యారేజ్ డేకి గుర్తుండిపోయేలా బ్లెస్సింగ్స్ అందించారు' అంటూ సోషల్ మీడియాలో షేర్ చేసాడు. 

గెటప్ శ్రీను ప్రస్తుతం సినిమాల్లో కూడా అవకాశాలు అందుకుంటున్నాడు. రంగస్థలం చిత్రంలో కల్లు దుకాణం నడిపే పాత్రలో నటించాడు. మరికొన్ని చిత్రాల్లో చిన్న రోల్స్ చేశాడు. 

 

PREV
click me!

Recommended Stories

Ram Charan v/s Pawan Kalyan: పెద్ది మూవీ వాయిదా? బాబాయ్‌ `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌` కోసం చరణ్‌ వెనక్కి
Illu Illalu Pillalu Today Episode Jan 24: ఇడ్లీ బాబాయిని చంపేస్తానన్న విశ్వక్, రాత్రికి అమూల్య జంప్?