విశాల్, ఆర్య 'ఎనిమి' ట్రైలర్.. మైండ్ బ్లోయింగ్ యాక్షన్

pratap reddy   | Asianet News
Published : Oct 23, 2021, 07:43 PM IST
విశాల్, ఆర్య 'ఎనిమి' ట్రైలర్.. మైండ్ బ్లోయింగ్ యాక్షన్

సారాంశం

విశాల్ వరుసగా థ్రిల్లర్, యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రాలు ఎంచుకుంటున్నాడు. ఆ కోవకు చెందిన చిత్రమే 'ఎనిమి'. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పర్ఫెక్ట్ మల్టీస్టారర్ మూవీ ఇది.

విశాల్ వరుసగా థ్రిల్లర్, యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రాలు ఎంచుకుంటున్నాడు. ఆ కోవకు చెందిన చిత్రమే 'ఎనిమి'. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పర్ఫెక్ట్ మల్టీస్టారర్ మూవీ ఇది. విశాల్ తో పాటు ఈ మూవీలో ఆర్య కూడా నటిస్తున్నాడు. చిన్ననాటి స్నేహితులుగా ఉన్న వీరిద్దరూ ఎలా శత్రువులుగా మారారు అనేదే ఈ చిత్ర కథ. 

ట్రైలర్ ఆరంభంలో Vishal , Arya చిన్ననాటి ఎపిసోడ్స్ చూపిస్తారు. ఇద్దరూ పోలీస్ కావడం కోసం శిక్షణ పొందుతుంటారు. కానీ పెద్దయ్యాక ఇద్దరి దారులు వేరవుతాయి. విశాల్ పోలీస్ అధికారిగా మారుతాడు. కానీ ఆర్య మాత్రం అతిపెద్ద క్రిమినల్ అవుతాడు. ఆర్య సమాజంలో సృష్టించే విధ్వంసం అంతా ఇంతా కాదు. 

Also Read: సంచలన ప్రెస్ మీట్ కు సమంత ప్లానింగ్.. అందరికీ కలిపి ఒకేసారి బుద్ది చెప్పేందుకే ?

దీనికి అడ్డుకోవడానికి విశాల్ తీవ్రంగా శ్రమిస్తుంటాడు. అసలు వీరిద్దరి మధ్య ఏం జరిగింది అనేది తెలుసుకోవాలంటే నవంబర్ 4 వరకు ఎదురుచూడాల్సిందే. ట్రైలర్ చూపిన యాక్షన్ ఎపిసోడ్స్ కళ్ళు చెదిరే విధంగా ఉన్నాయి. విజువల్ గ్రాండ్ గా ఉన్నాయి. సామ్ సీఎస్ అందించిన బ్యాగ్రౌండ్ సంగీతం అద్భుతంగా ఉంది. 

Prakash Raj కీలక పాత్రలో నటిస్తుండగా.. మృణాళిని రవి, మమతా మోహన్ దాస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వినోద్ కుమార్ ఈ చిత్రానికి నిర్మాత. అదే రోజున సూపర్ స్టార్ రజని పెద్దన్న కూడా విడుదలకు రెడీ అవుతోంది. 

PREV
click me!

Recommended Stories

Bandla Ganesh: రాంచరణ్ పెద్ది కోసం పవన్ కళ్యాణ్ త్యాగం.. బండ్ల గణేష్ కామెంట్స్ వైరల్
Maa Inti Bangaram Review: మా ఇంటి బంగారం మూవీ రివ్యూ.. సమంత కమ్‌ బ్యాక్‌ ఫిల్మ్ ఎలా ఉందంటే?