అల్లు అర్జున్ యాటిట్యూడ్ పై కామెంట్స్!

By Udayavani DhuliFirst Published Oct 9, 2018, 4:01 PM IST
Highlights

స్టైలిస్ట్ స్టార్ అల్లు అర్జున్ కి వివాదాలు కొత్తేమీ కాదు.. పవన్ కళ్యాణ్ గురించి 'చెప్పను బ్రదర్' అన్నప్పుడు నుండి ఆయన సోషల్ మీడియా వేదికగా చాలా విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అతడు నటించిన 'డిజే' సినిమాకి పాజిటివ్ రివ్యూలు ఇవ్వకపోవడంతో విమర్శకులను కామెంట్ చేసి మరోసారి వివాదాల్లో నిలిచాడు

స్టైలిస్ట్ స్టార్ అల్లు అర్జున్ కి వివాదాలు కొత్తేమీ కాదు.. పవన్ కళ్యాణ్గురించి 'చెప్పను బ్రదర్' అన్నప్పుడు నుండి ఆయన సోషల్ మీడియా వేదికగా చాలా విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అతడు నటించిన 'డిజే' సినిమాకి పాజిటివ్ రివ్యూలు ఇవ్వకపోవడంతో విమర్శకులను కామెంట్ చేసి మరోసారి వివాదాల్లో నిలిచాడు.

తాజాగా తన కేర్ లెస్ యాటిట్యూడ్ కారణంగా మరోసారి వార్తల్లో నిలిచాడు. సోషల్ మీడియాలో తమని ఫాలో అయ్యే అభిమానుల సంఖ్య మిలియన్స్ కి చేరుకున్న ప్రతిసారి సెలబ్రిటీలు అభిమానులకి థాంక్స్ చెబుతూ వారిపై ప్రేమను చాటుతుంటారు. బాలీవుడ్ అగ్ర హీరో అమితాబ్ బచ్చన్, ప్రియాంక చోప్రాలు సైతం తమ అభిమానులకు కృతజ్ఞతలు చెప్పిన సందర్భాలు ఉన్నాయి.

రీసెంట్ గా అల్లు అర్జున్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ 2 మిలియన్ ఫాలోవర్స్ ని దక్కించుకుంది. కానీ అల్లు అర్జున్ మాత్రం అభిమానులతో మాట్లాడే మూడ్ లో లేడు. మరోపక్క బన్నీ పీఆర్ టీమ్ అతడిని కొనియాడుతూ 2 మిలియన్ ఫాలోవర్స్ ని దక్కించుకున్న హీరో అంటూ పోస్టర్లు పెడుతున్నారు.

కానీ బన్నీ మాత్రం ఫ్యాన్స్ కి ఎలాంటి సందేశాన్ని ఇవ్వలేదు. బన్నీ తీరుతో అభిమానులు తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నారు. రెండు మిలియన్ ఫాలోవర్స్ సంఖ్య వెనుక బన్నీ అభిమానుల కృషి ఎంతో ఉందనే విషయం గుర్తించకుండా కనీసం అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేయాల్సిన నైతిక బాధ్యత కూడా అతడికి లేదా అంటూ ప్రశ్నిస్తున్నారు. 

 

click me!