'గీతా ఆర్ట్స్' రైట్స్ తీసుకుంది సరే, చేసే ఆర్టిస్ట్ లు ఎవరు

By Surya PrakashFirst Published Aug 4, 2021, 7:24 AM IST
Highlights

 అల్లు అరవింద్‌ ఇప్పటికే ఈ మలయాళ సూపర్‌ హిట్‌ చిత్రాన్ని రీమేక్‌ హక్కులను సొంతం చేసుకున్నారని వార్తలు వచ్చాయి.  తాజాగా ఈ విషయాన్ని దర్శకుడు మార్టిన్‌ అధికారికంగా ప్రకటించారు.
 

మలయాళంలో ఈ ఏడాది విడుదలైన ‘నాయట్టు’ చిత్రం సూపర్ సక్సెస్ అయ్యిన సంగతి తెలిసిందే. పొలిటికల్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా విమర్శల ప్రశంసలు సైతం పొందింది. నెట్‌ఫ్లిక్స్‌ లో రిలీజైన ఈ సినిమా ఇక్కడ మన తెలుగులో కూడా రివ్యూలు తెచ్చుకుంది. అంతలా మన వాళ్లనూ ఎట్రాక్ట్ చేసింది. త్వరలో తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేస్తారని అందరూ ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమాను రీమేక్‌ చేసే పనిలో పడింది గీతా ఆర్ట్స్‌.  అల్లు అరవింద్‌ ఇప్పటికే ఈ మలయాళ సూపర్‌ హిట్‌ చిత్రాన్ని రీమేక్‌ హక్కులను సొంతం చేసుకున్నారని వార్తలు వచ్చాయి.  తాజాగా ఈ విషయాన్ని దర్శకుడు మార్టిన్‌ అధికారికంగా ప్రకటించారు.

మార్టిన్‌ ప్రక్కట్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఈ సినిమాకు గౌతమ్‌ మీనన్‌ దర్శకత్వం వహిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాను తెలుగు, తమిళంతో పాటు హిందీలోనూ రీమేక్‌ చేయడానికి మేకర్స్‌ సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇక తెలుగు రీమేక్‌కు అల్లు అరవింద్‌ నిర్మాతగా వ్యవహరిస్తుండగా హిందీకి మాత్రం జాన్‌ అబ్రహం నిర్మాణ బాధ్యతలు చేపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ‘నయట్టు’ సినిమా థియేటర్లలోనే కాకుండా ఓటీటీ వేదికగా కూడా మంచి రెస్పాన్స్ అందుకుంది. మరి ఈ సినిమా రీమేక్‌కు సంబంధించి పూర్తి వివరాలను తెలియాలంటే అల్లు అరవింద్ వైపు నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. అయితే ఇలాంటి కథలో నటించే ఆర్టిస్ట్ లు తెలుగులో ఎవరు ఉన్నారనే చర్చ మొదలైంది. ఎందుకంటే స్టార్స్ చేసే సినిమా కాదు ఇది. 

చిత్రం స్టోరీలైన్ కు వెల్తే...కేరళలో ఎన్నికలప్పుడు ప్రవీణ్‌ మైఖేల్‌(బోబన్‌) పోలీసు స్టేషన్‌లో డ్యూటీలో  చేరతాడు. ఏఎస్‌ఐగా మనియన్‌(జోజు జార్జ్‌), కానిస్టేబుల్‌ సునీత అక్కడే పనిచేస్తుంటారు. ఓ వర్గానికి చెందిన  నాయకుడితో ప్రవీణ్, మనియన్‌లు వాగ్వాదానికి దిగుతారు. ఓ రోజు ఫంక్షన్‌కి ముగ్గురు వెళ్లొస్తుంటారు. ఆ వాహనాన్ని నడుపుతున్న వ్యక్తి ఆక్సిడెంట్‌ చేసి అక్కడినుంచి పారిపోతాడు. అక్కడ ప్రమాదానికి గురైన వ్యక్తి చనిపోతాడు. ఆయన ఎవరో కాదు. పోలీసు స్టేషన్‌లో గొడవకు దిగిన వ్యక్తికి దగ్గరి బంధువు కావటంతో కథ ముదిరి పాకాన పడుతుంది.

 ఆ వ్యక్తి సామాజిక వర్గానికి చెందిన వారంతా ఆందోళనకు దిగడంతో ఈ కేసు రాజకీయ రంగు పులుముకుంటుంది. ఏ సంబంధం లేని వీరి ముగ్గురిని ట్రాప్ లో పడేసేందుకు ప్రణాళికలు సిద్ధం అవుతున్నాయని తెలుసుకున్న మనియన్‌ మిగతా ఇద్దరితో కలిసి పోలీసు స్టేషన్‌ నుంచి పరారవుతాడు. దీంతో ఈ పోలీస్ ల కోసం వేట మొదలవుతుంది. సొంత డిపార్ట్‌మెంట్‌ వారే వీరిని వెంటాడుతూ పట్టుకునే ప్రయత్నం చేస్తారు. మరి వీరు ముగ్గురు ఆ కేసులోంచి బయటపడ్డారా? పోలీసులకు చిక్కారా లేదా? వీరి జీవితాలు ఎలాంటి టర్న్ తీసుకున్నాయన్నది మిగతా కథ.
 

click me!