యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి చేసిన మంచి పని తెలిస్తే మెచ్చుకోకుండా ఉండలేరు

Published : Aug 03, 2021, 06:18 PM ISTUpdated : Aug 03, 2021, 06:32 PM IST
యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి చేసిన మంచి పని తెలిస్తే మెచ్చుకోకుండా ఉండలేరు

సారాంశం

లాక్ డౌన్ టైమ్ లో ఉద్యోగం కోల్పోయిన సమీర్ అనే యువకుడు ఇబ్బందుల్లో ఉన్నాడని తన దృష్టికి రాగానే నవీన్ పోలిశెట్టి ఆ యువకుడి వివరాలతో ట్వీట్ చేశారు.

కరోనా టైమ్ లో తనకు వీలైనంత హెల్ప్ చేస్తున్నారు యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి. బాధితులతో వీడియో కాల్స్ లో మాట్లాడి వాళ్లకు ధైర్యం చెబుతూ, తనను సంప్రదిస్తున్న వారికి సహాయం అందిస్తున్నారు. లాక్ డౌన్ టైమ్ లో ఉద్యోగం కోల్పోయిన సమీర్ అనే యువకుడు ఇబ్బందుల్లో ఉన్నాడని తన దృష్టికి రాగానే నవీన్ పోలిశెట్టి ఆ యువకుడి వివరాలతో ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కు స్పందించిన ఈ వోక్ - వేగాన్ స్టోర్ అండ్ కేఫ్ సమీర్ కు స్టోర్ మేనేజర్ గా ఉద్యోగాన్ని కల్పించింది. 

సమీర్ కు ఈ వోక్ - వేగాన్ స్టోర్ అండ్ కేఫ్ పంపిన ఆఫర్ లెటర్ ను పోస్ట్ చేసిన నవీన్ పోలిశెట్టి తన నోటీస్ కు సమీర్ విషయాన్ని తీసుకొచ్చిన నెటిజన్స్  చరణ్, సౌమ్య లకు థాంక్స్ చెప్పారు. త్వరలో ఈ స్టోర్ కు తాను వెళ్తానని నవీన్ పోలిశెట్టి ట్వీట్ చేశారు. అలాగే పాండమిక్ టైమ్ లో ఉద్యోగాలు కోల్పోయిన వారిలో వీలైనంత మందికి తిరిగి ఉద్యోగాలు వచ్చేలా చొరవ తీసుకుందామంటూ ట్వీట్ లో పిలుపునిచ్చారు ఈ యంగ్ స్టార్.

PREV
click me!

Recommended Stories

హీరోలంతా లైన్‌ వేయడానికే అప్రోచ్‌ అవుతారని ఏకంగా స్టార్‌ హీరోని అవాయిడ్‌ చేసిన అనసూయ
జైలర్ 2 లో తమన్నాకి నో ఛాన్స్.. రజినీకాంత్ తో ఐటెం సాంగ్ లో స్టెప్పులేయబోతున్న బ్యూటీ ఎవరో తెలుసా ?