మంత్రి ఎర్రబెల్లిని కలిసిన నిర్మాత అల్లు అరవింద్

By team teluguFirst Published Aug 3, 2021, 6:27 PM IST
Highlights

రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారిని మర్యాదపూర్వకంగా కలిసిన ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్. 

నేడు హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో మంత్రుల క్యాంపు కార్యాలయం లో రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారిని మర్యాదపూర్వకంగా కలిసిన ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్. ఈ సందర్బంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఏడెళ్ళ కాలంలో తెలుగు చలన చిత్ర పరిశ్రమ గణనీయంగా అభివృద్ధి చెందిందని  మంత్రి అన్నారు. రాష్ట్రంలో చలనచిత్ర రంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎల్లవేళల సహాయ, సహకారాలు అందజేస్తున్నదని ఆయన తెలిపారు.

ఇక అల్లు రామలింగయ్య పేరున హైదరాబాద్ లో పెద్ద స్టూడియో నిర్మాణం చేపట్టారు. కొద్దినెలల క్రితం ఈ స్టూడియో నిర్మాణం మొదలైంది. అలాగే ఆహా అనే ఓటిటి యాప్ ని అల్లు అరవింద్ నిర్వహిస్తున్నారు. ఓన్లీ తెలుగు చిత్రాలు, సిరీస్ లతో ఆహా యాప్ సక్సెస్ ఫుల్ గా సాగుతుంది. తండ్రి అల్లు రామలింగయ్య సినిమా వారసుడిగా నాలుగు దశాబ్దాలకు పైగా అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ బ్యానర్ పై చిత్రాలు నిర్మిస్తున్నారు. 

click me!