గరుడవేగ శాటిలైట్,రీమేక్ హక్కుల కోసం క్యూ కడుతున్న నిర్మాతలు

Published : Nov 04, 2017, 03:29 PM ISTUpdated : Mar 25, 2018, 11:41 PM IST
గరుడవేగ  శాటిలైట్,రీమేక్ హక్కుల కోసం క్యూ కడుతున్న నిర్మాతలు

సారాంశం

పదేళ్ల తర్వాత హిరో రాజశేఖర్ కు హిట్ సినిమా గరుడవేగ బ్లాక్ బస్టర్ కావటంతో యూనిట్ లో ఆనందం రీమేక్, శాటిలైట్ రైట్స్ కోసం నిర్మాతల క్యూ

ఎట్టకేలకు దశాబ్ద కాలం తరవాత హీరో రాజశేఖర్ కి బ్లాక్ బస్టర్ తగిలింది. ఎప్పటి నుంచో కెరీర్ చరమాంకంలో ఉన్న ఈ హీరో ఇన్నేళ్ళ తరువాత సరైన హిట్ అందుకున్నాడు. గరుడవేగ సినిమా నిన్న విడుదల అయ్యి హౌస్ ఫుల్ కలక్షన్ లతో సాగుతోంది. ఇలాంటి సినిమా కోసం ఇలాంటి ఫలితం కోసం రాజశేఖర్ చాలా కాలం ఎదురు చూసాడు.

 

 

ఫస్ట్ హాఫ్ అదరహో అనిపించి సెకండ్ హాఫ్ కాస్త జోష్ తగ్గినా మొత్తం మీద హిట్టు సినిమా అయితే కొట్టేసాడు రాజశేఖరుడు. డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు సినిమా మొదలెట్టిన టైం లో ముప్పై కోట్ల బడ్జెట్, యాక్షన్ చిత్రం, రాజశేఖర్ హీరో అనగానే చాలా మంది నవ్వేసారు. అంత మార్కెట్ లేని హీరో మీద రిస్క్ ఏంటి అని.

 

 

ఇప్పుడు సినిమా చూసిన తరవాత ముప్పై కోట్లు కలక్షన్ ల మీద రాకపోయినా ఇరవై అయితే గ్యారెంటీ అంటున్నారు. మరొక పక్క శాటిలైట్ నే నమ్ముకుంది బృందం. ఇప్పుడు శాటిలైట్ తో పాటు రీమేక్ హక్కులు కూడా వచ్చి తీరతాయి. ఎందుకంటే అసలు పెద్ద హీరోలకి ఈ సినిమా కరక్ట్ గా సరిపోతుంది సో కన్నడ, తమిళ్ ప్రొడ్యూసర్ లు ఇప్పుడే తమ భాష లో రీమేక్ కోసం బేరాలు సాగిస్తున్నారు, అలాగే హిట్ టాక్ వచ్చిన తరవాత శాటిలైట్ కోసం కూడా ఈ సినిమా ప్రొడ్యూసర్ లకి ఛానల్ వాళ్ళ దగ్గర నుంచి చాలా కాల్స్ వస్తున్నాయి. సో మొత్తం మీద శాటిలైట్ - రీమేక్ హక్కులు కలిపి ఎంత లేదన్నా ఒక ఆరు కోట్ల వరకూ లాగుతారు. 

PREV
click me!

Recommended Stories

Funky vs Couple Friendly Box Office: ఫంకీ, కపుల్‌ ఫ్రెండ్లీ మూవీ కలెక్షన్లు.. విశ్వక్‌ సేన్‌కి సంతోష్‌ శోభన్‌ షాక్‌
Illu Illalu Pillalu Today Episode Feb 19: నర్మదకు దొరికిపోయిన సాగర్, డబ్బులు కొట్టేసేందుకు వల్లి ప్లాన్