ప్రభాస్‌ ఫ్యామిలీ నుంచి మరో హీరో..దర్శకుడిగా మారిన గణేష్‌ మాస్టర్‌.. టైటిల్‌ అదిరింది!

Published : Apr 10, 2024, 06:03 PM IST
ప్రభాస్‌ ఫ్యామిలీ నుంచి మరో హీరో..దర్శకుడిగా మారిన  గణేష్‌ మాస్టర్‌.. టైటిల్‌ అదిరింది!

సారాంశం

డాన్స్ మాస్టర్స్ హీరోలుగా, దర్శకులుగా మారి మెప్పించారు. ఇప్పుడు మరో కొరియోగ్రాఫర్‌ గణేష్‌ మాస్టర్‌ దర్శకుడిగా మారారు. ఆ మూవీ గ్రాండ్‌గా ప్రారంభమైంది.  

ప్రభాస్‌ ఫ్యామిలీ నుంచి మరో హీరో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. ఒకప్పుడు ప్రభాస్‌ సోదరుడు సినిమాల్లోకి వచ్చి సక్సెస్‌ కాలేకపోయారు. ఆ తర్వాత ఎవరూ రాలేదు. కృష్ణంరాజుకి అందరు కూతుర్లే, పెద్ద కూతురు నిర్మాతగా మారింది. ఇప్పుడు ప్రభాస్‌ఫ్యామిలీ నుంచి మరో హీరో రాబోతున్నారు. కృష్ణంరాజు బంధువు, ప్రభాస్‌కి కజిన్‌ అయ్యే విరాట్‌ రాజ్‌ హీరోగా టాలీవుడ్‌కి పరిచయం అవుతున్నారు. 

ఈ మూవీతో స్టార్‌ కొరియోగ్రాఫర్‌ గణేష్‌ మాస్టర్‌ దర్శకుడిగా మారడం విశేషం. ఆయన దర్శకుడిగా పరిచయం అవుతూ విరాట్‌ రాజ్‌ హీరోగా ఓ మూవీని రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి `గౌడ్‌ సాబ్‌` అనే టైటిల్‌ పెట్టారు. ఈ మేరకు బుధవారం రామానాయుడు స్టూడియోలో ఈ చిత్రం గ్రాండ్‌గా ప్రారంభమైంది. స్టార్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ గెస్ట్ గా ఈ మూవీ ప్రారంభమైంది. ఈ మూవీకి `గౌడ్‌ సాబ్‌` అనే ఇంట్రెస్ట్ ని క్రియేట్‌ చేస్తుంది. 

ఇక ఈ మూవీని మల్లీశ్వరి సమర్పణలో శ్రీపాద ఫిల్మ్స్ పతాకంపై `ఎస్‌ఆర్‌ కళ్యాణమండపం` రాజు, కల్వకోట వెంకటరమణ, కటారి సాయి కృష్ణ కార్తీక్‌, సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందుతుంది. ఈ మూవీకి ఆర్‌ఎం స్వామి కెమెరామెన్‌గా, చోటా కే ప్రసాద్ ఎడిటర్‌గా, వేంగి మ్యూజిక్‌ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. 

ఇదిలా ఉంటే గతంలో డాన్స్ మాస్టర్స్ హీరోగా మారి అలరించారు. ప్రభుదేవా, లారెన్స్ వంటి వారు హీరోలుగా ఎదిగారు. అదే సమయంలో దర్శకులుగానూ నిరూపించుకున్నారు. స్టార్స్ గా ఎదిగారు. ఇక ఆ మధ్య జానీ మాస్టర్‌ సైతం హీరోగా పరిచయం అయ్యాడు. కానీ ఆ మూవీ అప్‌డేట్‌ లేదు. ఇంకోవైపు శేఖర్‌ మాస్టర్‌ కూడా పలుసినిమాల్లో మెరుస్తున్నారు. ఆయన కూడా హీరోగా నటించే అవకాశాలున్నాయి. ఇలా డాన్స్ మాస్టర్స్ హీరోలుగా, దర్శకులుగా మారడం విశేషం. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Shilpa Shetty ఇంట్లో ఐటీ దాడులు? 60 కోట్ల మోసం విషయంలో అసలు నిజం ఏంటో తెలుసా?
మూడో వారంలో ఎలిమినేట్ కావలసిన వాడు తనూజని వాడుకుని విన్నర్ రేసులోకి వచ్చేశాడు.. భరణి సంచలన వ్యాఖ్యలు