ఇద్దరు హీరోయిన్లతో విజయ్‌ దేవరకొండ రొమాన్స్ ?.. తెరపైకి లేటెస్ట్ యంగ్‌ సెన్సేషన్‌

Published : Apr 10, 2024, 01:13 PM IST
ఇద్దరు హీరోయిన్లతో విజయ్‌ దేవరకొండ రొమాన్స్ ?.. తెరపైకి లేటెస్ట్ యంగ్‌ సెన్సేషన్‌

సారాంశం

విజయ్‌ దేవరకొండ .. ఇప్పుడు ఇద్దరు హీరోయిన్లతో రొమాన్స్ కి రెడీ అవుతున్నాడు. ఇద్దరు సెన్సేషనల్‌ బ్యూటీస్‌తో కలిసి రచ్చ చేసేందుకు వస్తున్నాడు.   

రౌడీ బాయ్‌ విజయ్‌ దేవరకొండ నటించిన `ఫ్యామిలీ స్టార్‌` మూవీ ఇటీవల విడుదలైన మిశ్రమ స్పందన తెచ్చుకుంది. విపరీతమైన నెగటివిటీ సినిమాని కిల్‌ చేసిందని చెప్పొచ్చు. ఇక ఇప్పుడు మరో సినిమాకి రెడీ అవుతున్నారు విజయ్‌ దేవరకొండ. గౌతమ్‌ తిన్ననూరితో ఆయన ఓ సినిమా చేస్తున్నారు. `వీడీ12` పేరుతో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఇప్పటికే ఫస్ట్ లుక్‌ని కూడా విడుదల చేశారు. దీనిపై చాలా చర్చ జరిగింది. హాలీవుడ్‌ సినిమాకి కాపీ అంటూ రచ్చ మొదలైంది. 

`ఫ్యామిలీ స్టార్‌` హడావుడి పూర్తయ్యాక ఈ సినిమా షూటింగ్‌ని ప్రారంభించబోతున్నారు. ఈ మేరకు ప్రీ ప్రొడక్షన్‌ వర్క్ చేస్తున్నారు. హీరోయిన్లని ఫైనల్‌ చేసే పనిలో ఉన్నారు. నిజానికి ఇందులో హీరోయిన్‌గా మొదట శ్రీలీలని అనుకున్నారు. ఫైనల్‌ కూడా అయ్యింది. కానీ ఇప్పుడు ఆమె తప్పుకుందట. ఆమె స్థానంలో వేరే హీరోయిన్లని అనుకుంటున్నారు. ఈక్రమంలో ఇద్దరు కొత్త హీరోయిన్ల పేర్లు తెరపైకి వచ్చాయి. అందులో మలయాళ సెన్సేషనల్ బ్యూటీ కూడా ఉండటం విశేషం. 

`ప్రేమలు` చిత్రంతో తెలుగు ఆడియెన్స్ కి దగ్గరయ్యింది మమిత బైజు. ఈ మలయాళ మూవీ అక్కడ పెద్ద హిట్‌ అయ్యింది. తెలుగులోనూ మెప్పించింది. ఇందులో రీను పాత్రలో నటించింది మమితబైజు. అద్భుతమైన నటనతో మెప్పించింది. అందంతో మాయ చేసింది. డబ్బింగ్‌ సినిమాతోనే తెలుగు ఆడియెన్స్ కి దగ్గరయ్యింది. యంగ్‌ సెన్సేషన్‌గా మారింది. తమిళంలోనూ `రెబల్‌` చిత్రంలో నటించి మెప్పించింది. దీంతో ఇప్పుడు తెలుగులోనూ ఈ బ్యూటీకి ఆఫర్లు క్యూ కడుతున్నాయట. అందులో భాగంగా విజయ్‌ సినిమాలో ఆఫర్‌ వచ్చిందని సమాచారం. మేకర్స్ ఆమెతో చర్చలు జరుపుతున్నారని తెలుస్తుంది. ఆల్మోస్ట్ ఫైనల్‌ అంంటున్నారు. 

ఆమెతోపాటు మరో హీరోయిన్‌తోనూ డిస్కషన్‌ జరుగుతున్నాయట. ఆమె కూడా కొత్త అమ్మాయే. బాలీవుడ్‌లో సినిమాలు చేసింది. భాగ్యశ్రీ బోర్సే అనే హీరోయిన్ ని కూడా తీసుకోవాలనుకుంటున్నారట. సోషల్‌ మీడియాలో అందాల విందుతో సెన్సేషన్‌గా మారిన ఈ బ్యూటీ ఇప్పటికే హిందీలో `యారియాన్‌ 2`లో నటించింది. ఆమె ఇప్పుడు రవితేజ సరసన `మిస్టర్ బచ్చన్‌`లో కనిపించబోతుందట. అంతేకాదు విజయ్‌ దేవరకొండ సినిమాకి కూడా అడుతున్నారట. అయితే దీనిపై మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది.  

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Thalapathy Vijay సినిమా స్టోరీ లీక్, జన నాయగన్ కథ ఇదేనా? షాక్ లో మూవీ టీమ్
Pawan Kalyan కోసం రామ్ చరణ్ త్యాగం? పెద్ది రిలీజ్ పై మెగా అభిమానుల్లో ఆందోళన