భక్తి శ్రద్దలతో గణేష్ నిమజ్జనం నిర్వహించిన మహేష్ బాబు.. వీడియో చూశారా

pratap reddy   | Asianet News
Published : Sep 15, 2021, 05:27 PM IST
భక్తి శ్రద్దలతో గణేష్ నిమజ్జనం నిర్వహించిన మహేష్ బాబు.. వీడియో చూశారా

సారాంశం

సూపర్ స్టార్ మహేష్ బాబు కేవలం తన సినిమాలకు మాత్రమే కాదు..ఫ్యామిలీకి, సంప్రదాయాలకు కూడా అంతే సమయం కేటాయిస్తారు. ఎంత బిజీగా ఉన్నా మహేష్ తన కుటుంబంతో స్పెండ్ చేస్తాడు.

సూపర్ స్టార్ మహేష్ బాబు కేవలం తన సినిమాలకు మాత్రమే కాదు..ఫ్యామిలీకి, సంప్రదాయాలకు కూడా అంతే సమయం కేటాయిస్తారు. ఎంత బిజీగా ఉన్నా మహేష్ తన కుటుంబంతో స్పెండ్ చేస్తాడు. ప్రతి ఏటా జరిగే విధంగానే మహేష్ బాబు ఇంట్లో ఈ ఏడాది కూడా వినాయక చవితి పూజలు జరిగాయి. 

తాజాగా మహేష్ తన ఇంట్లో వినాయక ప్రతిమకు నిమజ్జనం నిర్వహించాడు. తన సతీమణి నమ్రత.. పిల్లలు సితార, గౌతమ్ లతో కలసి మహేష్ గణేష్ నిమజ్జన వేడుకలను నిర్వహించారు. ఈ వీడియోను నమ్రత సోషల్ మీడియాలో షేర్ చేసింది. 

మహేష్ చాలా భక్తి శ్రద్దలతో గణేశుడికి పూజలు చేస్తుండగా కుటుంబ సభ్యులు చూస్తున్నారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులంతా కలసి గణేషుడిని నిమజ్జనం చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

వినాయకుడికి వీడ్కోలు అనే మాటే ఉండదు. ఆయన ఆశీస్సులు మా కుటుంబంపై ఎప్పుడూ ఉంటాయి. వచ్చే ఏడాది మా ఇంటికి మళ్ళీ వినాయకుడు వస్తాడు అని నమ్రత పోస్ట్ చేసింది. 

సినిమాల విషయానికి వస్తే మహేష్ ప్రస్తుతం పరుశురాం దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం సంక్రాంతి రిలీజ్ కు రెడీ అవుతోంది. 

 

PREV
click me!

Recommended Stories

Raakaasa Movie Review: రాకాస మూవీ రివ్యూ, రేటింగ్‌.. నిహారిక, సంగీత్‌ శోభన్‌ ల మూవీ ఎలా ఉందంటే?
Jabardasth : కిరాక్ ఆర్పీ మోసం చేసిన జబర్దస్త్ కమెడియన్ ఎవరో తెలుసా? ఏం చేశాడంటే?