గేమ్ ఛేంజర్ నుంచి ట్రైలర్ రిలీజ్, డ్యూయల్ రోల్ లో రామ్ చరణ్ మాస్ ట్రీట్..

By Mahesh Jujjuri  |  First Published Jan 2, 2025, 6:45 PM IST

మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ .. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న టైమ్ రానే వచ్చింది. మెగా పవర్ స్టార్ మూవీ ట్రైలర్ కోసం కళ్ళు కాయలు కాచేలా చూసిన ఫ్యాన్స్  కు మాస్ ట్రీట్ ఇచ్చాడు శంకర్. 



మెగా పవర్ స్టార్ గ్లోబల్ హీరో  రామ్ చరణ్ మాస్ ట్రీట్ అదిరించి.. ఎప్పుడు కనిపించని డిఫరెంట్ రోల్ లో చరణ్ ను చూపించబోతున్నాడు శంకర్. దానికి నిరద్శనంగా గేమ్ ఛేంజర్ నుంచి థియేట్రికల్ ట్రైలర్ నురిలీజ్ చేశారు. ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామా గా తెరకెక్కిన ఈసినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు పెరిగిపోయాయి. ఆ అంచనాలు మరింతపెంచుతూ.. ట్రైలర్ దుమ్మురేపిందని చెప్పవచ్చు.  బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ  హీరోయిన్ గా నటించని ఈసినిమాలో  అంజలి, శ్రీకాంత్, సునిల్  కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న గ్రాండ్ గా విడుదల కాబోతుంది. దీంతో ఈ మూవీ ప్రమోషన్స్ సూపర్ ఫాస్ట్ గా చేస్తున్నారు మూవీ టీమ్. ఇ

 ట్రైలర్ ఎలా ఉందంటే  ..? 

మెగా ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించే విధంగా ఉంది గేమ్ ఛేంజర్ ట్రైలర్ .  కడుపు నిండా 100 ముద్దలు తినే ఏనుగు.. ఒక్క ముద్ద వదిలిపెడితే దానికొచ్చిన నష్టం ఏమీ లేదు.. అది వంద చీమలకు ఆహారం అంటూ రామ్ చరణ్ చెప్పిన డైలాగ్ తో పాటు  మా పార్టీ సేవ చేయడానికే కానీ సంపాదించడానికి కాదు అంటూ చెప్పిన మరో డైలాగ్  చరణ్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటున్నాయి. ఇక రామ్ నందన్ గా.. ఆయన తండ్రి  అప్పన్న పాత్రలలో డ్యూయల్ యాక్టింగ్ ఇరగదీసినట్టు కనిపిస్తోంది.  చరణ్ యాక్టింగ్ తో పాటు  డైలాగ్స్ కూడా గట్టిగా పేలాయి.   శ్రీకాంత్ పాత్ర కాస్త డిఫరెంట్ గా అనిపించింది. ఇక అంజలి, ఎస్ జే సూర్య యాక్టింగ్ ప్రేక్షకులను అలరించేలా ఉన్నాయి. తమన్ మ్యూజిక్ చెప్పనక్కర్లేదు. 

Latest Videos

ఇక కొండాపూర్ లోని AMB మాల్ లో జరిగింది ఈ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్.  ఈ అద్భుతమైన ట్రైలర్ ను డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి చేతుల మీదుగా రిలీజ్ చేయించారు.  ట్రైలర్ ఇలా రిలీజ్ అయ్యిందో లేదో.. అలా  అదిరిపోయింది అంటూ రెస్పాన్స్ వస్తూనే ఉంది సోషల్ మీడియాలో. ఈ ట్రైలర్ చూసుకుంటే.. మూవీ మొత్తంలో చరణ్ లుక్స్, మేనరిజం మరోసారి మెగా అభిమానులను అలరించబోతున్నాయి.   ఇక ఈ వేడుకకు భారీ ఎత్తున ఫ్యాన్స్ రావడంతో పోలీసు బందోబస్త్ ఏర్పాటు చేశారు. 

Also Read: గేమ్ ఛేంజర్ కోసం డైరెక్టర్ శంకర్ తీసుకున్న రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?

 
5 ఏళ్ళ తరువాత సోలో హీరోగా..

2019 తరువాత రామ్ చరణ్ సోలో హీరోగా వస్తున్న సినిమా కావడంతో ఈమూవీపై భారీ అంచనాలు ఉన్నాయి.  ఈమధ్యలో ఆర్ఆర్ఆర్, ఆచార్య వచ్చినా.. అవి మల్టీ స్టారర్ర కావడంతో చరణ్ సోలో సినిమా కోసం ఫ్యాన్స్ ఎదరుచూస్తున్నారు. 2019 లో వినయవిధేయ రామ తరువాత చరణ్ సోలో మూవీ రాలేదు. అది కూడా ప్లాప్ సినిమా కావడంతో.. సోలోగా సాలిడ్ హిట్ కొట్టడం కోసం ఎదరు చూస్తున్నాడు చరణ్. వింత ఏంటంటే.. అప్పుడు ఇప్పుడు హీరోయిన్ గా కియారానే చరణ్ తో నటించడం విశేషం. 

అంతే కాదు ఆర్ఆర్ఆర్ తరువాత రామ్ చరణ్ గ్లోబల్ హీరోగా మారిపోయాడు. దాంతో గేమ్ ఛేంజర్ రిజల్ట్ గురించి అంతా ఎదురుచూస్తున్నారు. ఇక  ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్, సాంగ్స్ ఫుల్ ట్రెండ్ అయి వైరల్ అయ్యాయి. ఇక ట్రైలర్ కూడా వచ్చేయడంతో  ఈసినిమా ప్రమోషన్స్ సక్సెస్ ఫుల్ గా సాగుతున్నాయి. అమెరికాలో తెగ హడావిడి చేసిన టీమ్.. ఇఫ్పుడు ఇండియాలో లో  ప్రమోషన్స్ జోరు పెంచింది. 


సంక్రాంతి కానుకగా.. 

మెగా పవర్ స్టార్,  గ్లోబల్  హీరో రామ్ చరణ్  గేమ్ ఛేంజర్ సినిమాతో రాబోతున్నారు.  సంక్రాంతి కానుకగా జనవరి 10న గేమ్ ఛేంజర్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున  రిలీజ్ కాబోతోంది.  ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్, పోస్టర్స్ కట్టిపడేశాయి. అలాగే ఇందులో చరణ్ డ్యూయల్ రోల్  చేస్తుండడంతో సినిమాపై మరింత అంచనాలు పెరిగాయి. రామ్ చరణ్ తో పాటు గా అటు శంకర్ కూడా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటనున్నట్లు తెలుస్తోంది. 

 గేమ్ ఛేంజర్ హిట్ అవ్వడం అటు చరణ్ కు.. ఇటు శంకర్ కు చాలా ముఖ్యం. దాదాపు 3 ఏళ్ళకు పైగా షూటింగ్ జరుపుకున్న ఈసినిమా రిజల్ట్ గురించి అంతా టెన్షన్ గా ఉన్నారు. ఇక ఈసినిమా తరువాత రామ్ చరణ్ బుచ్చిబాబు సాన డైరెక్షన్ లో సినిమా ఓపెనింగ్ అయ్యింది. ఈమూవీలో జాన్వీ కపూర్ హీరోయన్ గా నటిస్తోంది. రెగ్యులర్ షూటింగ్ త్వరలో స్టార్ట్ కాబోతున్నట్టు తెలుస్తోంది. 
 

click me!