మళ్ళీ నా మనసు గాయపరచకండీ.. ఫ్యాన్స్ కు యష్ విన్నపం, విషయం ఏంటంటే..?

By Mahesh Jujjuri  |  First Published Dec 31, 2024, 4:31 PM IST

కెజియఫ్ తరువాత లాంట్ గ్యాప్ తీసుకున్న యష్.. ప్రస్తుతం టాక్సిక్ మూవీ బిజీలో ఉన్నాడు. ఈసారి కూడా సాలిడ్ హిట్ తో బయటకు రావాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఆక్రమంలో యష్ ఫ్యాన్స్ కు బహిరంగ లేఖ రాశారు. మెత్తగా స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు. 


 రాకింగ్ స్టార్ యష్ తన అభిమానులకు నూతన సంవత్సరానికి ఒక రోజు ముందుగానే పుట్టినరోజు సందేశం ఇచ్చారు. గతేడాది నా పుట్టినరోజు వేడుకల్లో కటౌట్ నిలబెట్టే ప్రయత్నంలో ముగ్గురు అభిమానులు ప్రాణాలు కోల్పోయారు. ఈసారి అలాంటి సంఘటనలకు తావులేకుండా చూసుకోండి. ఈసారి నా పుట్టినరోజు (జ.8) నాడు నేను ఊళ్ళో ఉండను అని అభిమానులకు తెలిపారు. 

ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ, 'ప్రియమైన అభిమానులకు నమస్కారం. మీ అభిమానంతో మరో ఏడాదిని సార్థకం చేసుకున్నాను. నూతన సంవత్సరంలో నవ్వుతూ, కొత్త ఆశలతో బ్రతుకుదాం. జీవితాన్ని మరింత అందంగా మార్చే కొత్త ప్రణాళికలతో నూతన సంవత్సరాన్ని స్వాగతిద్దాం. 

Latest Videos

సినిమా షూటింగ్ కారణంగా నా పుట్టినరోజున ఊళ్ళో ఉండను. నా పుట్టినరోజు వేడుకల్లో మీరు చూపించే అభిమానం బాధ్యతాయుతంగా ఉండాలని కోరుకుంటున్నాను. కాబట్టి ఫ్లెక్సీలు, బ్యానర్లు వంటి ఆర్భాటాలు చేయకుండా, నా మనసుకు బాధ కలిగించే పనులు చేయకుండా, మీరు ఎక్కడున్నా మీ కుటుంబ సభ్యులు గర్వపడే పనులు చేయండి. అంతకంటే పెద్ద పుట్టినరోజు కానుక నాకు ఇంకేమీ వద్దు. త్వరలోనే మీ అందరినీ కలుస్తాను. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీ ప్రియతముడు యష్' అని రాస్తూ పోస్ట్ షేర్ చేశారు.

🙏 చిత్రాన్ని చూడండి

మరో పోస్ట్‌లో జనవరి 8న.. మీరు నాపై చూపిస్తున్న అభిమానాన్ని నాతో స్వయంగా పంచుకోవాలని ఆశపడే రోజు. నాకూ అంతే.. పుట్టినరోజు సందర్భంగా మీతో సమయం గడపాలని ఉంది. కానీ, సినిమా షూటింగ్ వల్ల బిజీగా ఉండటంతో ప్రయాణం చేయాల్సి వస్తోంది. అందుకే ఈ జనవరి 8న మీతో ఉండలేకపోతున్నాను. మీ అభిమానం నా లేకపోవడాన్ని అర్థం చేసుకుంటుందని నమ్ముతున్నాను. ఎల్లప్పుడూ నాతో ఉండే మీ ప్రేమ, అభిమానమే నాకు పుట్టినరోజు కానుక. మీ ప్రియతముడు యష్ అంటూ మరో పోస్టర్‌ను రూపొందించి షేర్ చేశారు.

 

click me!