ఈ ఫొటోలో ఉన్న కుర్రాడెవరో గుర్తు పట్టారా? చరిత్ర సృష్టించేందుకు ముహుర్తం పెట్టేశాడు..

By Narender Vaitla  |  First Published Jan 2, 2025, 4:03 PM IST

సోషల్‌ మీడియా విస్తృతి కారణంగా నిత్యం నెట్టింట ఎన్నో రకాల ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా సినీతారలకు సంబంధించి ఫొటోలు సోషల్‌ మీడియాలో ఎక్కువగా సర్క్యూలేట్‌ అవుతున్నాయి. అలాంటి ఓ ఫొటో గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 
 


చిన్ననాటి ఫొటోలను చూసుకోవడం అందరినీ ఆశ్చర్యంగానే ఉంటుంది. అందులోనూ అభిమాన తారల ఫొటోలు చూస్తే మరింత ఖుషీ అవుతుంటారు ఫ్యాన్స్‌. పైన ఫొటోలో కనిపిస్తున్న కుర్రాడి ఫొటో ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతోంది. రాజసం ఉట్టి పడేలా నవ్వులు చిందిస్తోన్న ఈ కుర్రాడు ఎవరో గుర్తు పట్టారా.? ప్రస్తుతం టాలీవుడ్‌లో ఎక్కువ పాపులారిటీ ఉన్న హీరోల్లో ఒకరిగా పేరు సంపాదిచుకున్నారు. కోట్లాది మంది అభిమాలను సొంతం చేసుకున్నారు. ఇంతకీ ఈ హీరో ఎవరో గుర్తు పట్టారా.? 

Latest Videos

తండ్రి నట వారసత్వం ఉన్నా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. బాలనటుడిగా కెరీర్‌ మొదలు పెట్టి అద్భుత నటనతో ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీని షేక్‌ చేసేందుకు దర్శకుడు ధీరుడు రాజమౌళితో చేతులు కలిపారు. ఈపాటికే ఈ హీరో ఎవరో ఓ క్లారిటీ వచ్చేసి ఉంటుంది కదూ! అవును ఈ కుర్రాడు మరెవరో కాదు సూపర్‌ స్టార్ మహేష్‌ బాబు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by @urstrulymbfans

బాలనటుడిగా.. 

మహేష్‌ బాబు 1979లో నీడా సినిమాతో బాల నటుడిగా కెరీర్‌ మొదలు పెట్టారు. తండ్రి కృష్ణ నటించిన పలు చిత్రాల్లో నటిస్తు వచ్చారు. గూడఛారి 117, బాలచంద్రుడు, కొడుకు దిద్దిన కాపురం వంటి చిత్రాల్లో బాల నటుడిగా మెప్పించాడు. ఇక 1999లో తొలిసారి రాజకుమారుడు మూవీతో హీరోగా పరిచయమైన మహేష్‌.. తొలి సినిమాతోనే భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. యువరాజు, వంశీ, మురారీ ఇలా బ్యాక్‌ టు బ్యాక్‌ విజయాలతో అమ్మాయిల కలలరాకుమారుడిగా మారారు. 

 

ప్రయోగాలు కూడా.. 

కేవలం కమర్షియల్‌ ఫార్మట్‌ సినిమాల్లో మాత్రమే కాకుండా మహేష్‌ బాబు పలు ప్రయోగాత్మక చిత్రాల్లో కూడా నటించి మెప్పించారు. టక్కరి దొంగ, నిజం, అర్జున్‌, బాబీ, నాని, వన్ నేనొక్కడినే వంటి చిత్రాలు ఇదే జాబితాలోకి వస్తాయి. ఒక్కడు, బిజినెస్‌ మ్యాన్‌, పోకిరి వంటి ఇండస్ట్రీ హిట్‌లను అందించారు మహేష్‌. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by @urstrulymbfans

అవార్డులు.. 

ఒక మహేష్‌ నటనకు ఎన్నో అవార్డులు వరించాయి. సినిమా అవార్డుల్లో భాగంగా ఒక్కడు, దూకుడు, వన్‌ నేనొక్కడినే చిత్రాలకు బెస్ట్‌ యాక్టర్‌ అవార్డులను అందికున్నారు. ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్‌ సౌత్‌లో భాగంగా ఒక్కడి, పొకిరి, దూకుడు, సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, శ్రీమంతుడు సినిమాలకు ఉత్తమ నటుడిగా అవార్డులు అందుకున్నాడు. అంతేకాకుండా రాజకుమారుడు, మురారి, టక్కరి దొంగ, అర్జున్‌, నిం, అతడు, దూకడు చిత్రాలకు గాను మహేష్‌ బాబును ఉత్తమ నంది అవార్డులు వరించాయి. సంతోషం ఫిల్మ్ అవార్డ్స్‌, సౌత్‌ ఇండియా ఇంటర్నేషనల్‌ అవార్డ్స్‌ ఇలా ఎన్నో మహేష్‌ నటను దాసోహం అయ్యాయి. 

రాజమౌళితో.. 

ప్రస్తుతం మహేష్‌ బాబు దర్శకు ధీరుడు రాజమౌళితో సినిమా చేస్తున్నారు. ఎలాంటి చడీచప్పుడు లేకుండా చిత్ర యూనిట్ గురువారం ఈ సినిమా పూజా కార్యక్రమాన్ని మొుల పెట్టేంది. రాజమౌళి కుటుంబ సభ్యులు, మహేష్‌, నమత్రతతో పాటు కొంతమంది టెక్నీషియన్స్‌ పూజా కార్యక్రమంలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. మొదటి షెడ్యూల్‌లో భాగంగా విజయవాడ దగ్గర్లో ఏర్పాటు చేయనున్న ఓ సెట్‌లో షూటింగ్ చేస్తారని తెలుస్తోంది. అమెజాన్‌ అడువుల నేపథ్యంలో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాను 2027లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాజమౌళి ఇందుకోసం ఏకంగా ఏఐ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారని కూడా వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాలో మహేష్‌ డ్యూయల్‌ రోల్‌లో నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి ఈ విషయాల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. 

మహేష్ మూవీ కోసం లొకేషన్ వేటలో రాజమౌళి.. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by SS Rajamouli (@ssrajamouli)

 

 

click me!