'గాలిసంపత్'కు షాక్, ఆ మూవీ థియేటర్స్ లో 'జాతిరత్నాలు' షోలు?

By Surya Prakash  |  First Published Mar 15, 2021, 12:21 PM IST

మహా శివరాత్రి నాడు మూడు తెలుగు సినిమాలు థియేటర్లోకి దిగాయి. అవి… శ్రీకారం, జాతిరత్నాలు, గాలి సంపత్. ఈ మూడు సినిమాల్లో ఏది విజేతో మార్నింగ్ షోకే తేలిపోయింది. జాతి రత్నాలు తమకు తెగ నచ్చేస్తోందని జనాలు చెప్పేసారు. చిన్న సినిమాగా విడుదలైన జాతి రత్నాలకే ఎక్కువ ఓపెనింగ్ వచ్చింది. ఫస్ట్ డే…. తెలంగాణ, ఆంధ్ర, అమెరికా…ఇలా అంతటా బ్రహ్మాండమైన కలెక్షన్లు వచ్చాయి.

 గురువారం విడుదలైన ఈ చిత్రం.. లాంగ్ వీకెండ్‌ను చాలా బాగా ఉపయోగించుకుంటోంది. కేవలం మూడు రోజుల్లోనే ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ అయిపోవడం విశేషం. ఆదివారం నుంచి ఈ చిత్రం లాభాలు అందుకుంటోంది. అయితే జాతి రత్నాలు గాలిలో మిగతా రెండు సినిమాల ఊసు అసలు వినపడటం లేదు. ముఖ్యంగా ఇప్పుడు గాలి సంపత్ ని తీసేసి..జాతి రత్నాలును వేస్తున్నట్లు సమాచారం. 

Latest Videos

గాలి సంపత్ సినిమా ఆక్యుపెన్సీ రేటు బాగా తక్కువగా ఉంది. కలెక్షన్స్ పూర్తి స్దాయిలో డ్రాప్ అయ్యాయి. దాంతో ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ మాట్లాడుకుని గాలి సంపత్ ని చాలా థియేటర్స్ లో తీసేసి జాతి రత్నాలు వేస్తున్నట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. ప్రస్తుతం లీడింగ్ డైరెక్టర్ లలో ఒకరైన అనిల్ రావిపూడి బ్రాండ్ నేమ్ ఉన్నా కూడా సినిమాకి కలిసి రాలేదు. ఎందుకో ఈ సినిమాకి సరైన ఓపెనింగ్ కనిపించలేదు. ఫస్ట్ డే నుంచీ రేస్ లో పూర్తిగా వెనుకబడింది.
 
మరో ప్రక్క పెద్దగా ఊపులేక కరోనా తర్వాత దిగులుగా ఉన్న యుఎస్ మార్కెట్‌‌లో సైతం ‘జాతిరత్నాలు’ ఊపు తీసుకొచ్చింది.  ఈ సినిమా కోసం అక్కడి జనాలు ఎగబడుతున్నారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఈ సినిమా చూడటం కలిసొస్తోంది. దీంతో ప్రిమియర్స్ నుంచే ‘జాతిరత్నాలు’ 1.33 లక్షల డాలర్లు కొల్లగొట్టింది. కరోనా విరామం తర్వాత ఓ ఇండియన్ సినిమాకు వచ్చిన అత్యధిక ప్రిమియర్ వసూళ్లు ఇవే అని చెప్తున్నారు.  

click me!