
బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ పుట్టినరోజు నేపథ్యంలో ఆర్ ఆర్ ఆర్ నుండి ఆమె లుక్ విడుదల చేశారు. ఆర్ ఆర్ ఆర్ లో సీత అనే పాత్ర చేస్తున్నారు అలియా భట్. ఆర్ ఆర్ ఆర్ హీరోలలో ఒకరైన చరణ్, రామరాజు పాత్ర చేస్తుండగా... ఆయన ప్రేయసి సీతగా అలియా భట్ కనిపించనుంది. ఆర్ ఆర్ ఆర్ లో కీలకమైన ఈ పాత్ర కోసం రాజమౌళి ఏరి కోరి బాలీవుడ్ నుండి తీసుకువచ్చారు.
ఎరుపు జాకెట్, పాపిడి బిళ్ళ, నుదుట బొట్టు, పచ్చ చీర కట్టుకొని ఉన్న అలియా భట్ 1920ల నాటి అమ్మాయిగా, అమాయకంగా కనిపించారు. దేశ భక్తి కోసం ప్రియరాలి ప్రేమను త్యాగం చేసిన ప్రియుడు కోసం వేచి చూస్తున్నట్లు ఆమె ఫోజ్ ఉంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ లుక్స్ తరువాత ఆర్ ఆర్ ఆర్ నుండి వచ్చిన అలియా లుక్ కూడా సినిమాపై ఆసక్తి పెంచుతుంది.
ఇక ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ చివరి దశకు చేరింది. పతాక సన్నివేశాలు కూడా చిత్రీకరించినట్లు ఇటీవల చిత్ర యూనిట్ తెలియజేశారు. దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆర్ ఆర్ ఆర్ విడుదల అక్టోబర్ 13గా నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడిన నేపథ్యంలో అనుకున్న సమయానికి మూవీ విడుదలయ్యేలా రాజమౌళి షూటింగ్ నిర్వహిస్తున్నారు.