వెన్నెల కిషోర్ చేసిన పనికి స్పృహ కోల్పోయిన ప్రముఖ సింగర్!

Published : Sep 28, 2018, 11:01 AM IST
వెన్నెల కిషోర్ చేసిన పనికి స్పృహ కోల్పోయిన ప్రముఖ సింగర్!

సారాంశం

ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ కమెడియన్ గా దూసుకుపోతున్నాడు వెన్నెల కిషోర్. ఈ మధ్య కాలంలో దాదాపు అన్ని సినిమాలలో తన కామెడీతో నవ్వించాడు ఈ నటుడు. నిన్న విడుదలైన 'దేవదాస్' సినిమాలో కూడా తన నటనతో ఆకట్టుకున్నాడు. 

సినిమాలలో ఎంత బిజీగా ఉన్నా.. సోషల్ మీడియాకి కూడా సమయం కేటాయిస్తూ అభిమానులను ఎంటర్టైన్ చేస్తుంటాడు. ఈ క్రమంలో తాజాగా ఓ పాట పాడి ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు వెన్నెల కిషోర్. తిన్నది అరక్క.. అనే కాన్స్పేట్ తో చచ్చారు పో.. అంటూ మొదలుపెట్టిన ఈ మొదటి సీజన్ ఫస్ట్ ఎపిసోడ్ ని సింగర్ చిన్మయికి అంకితం చేశాడు. పాట పాడిన వీడియోని షేర్ చేశాడు.

'ఎవరో ఆ సుందరి' అంటూ వెన్నెల కిషోర్ పాడిన పాట పై నవదీప్ వింత ఎక్స్ ప్రెషన్స్ తో ఓ వీడియో చేసి పోస్ట్ చేశాడు. నటుడు బ్రహ్మాజీ కామెంట్ చేస్తూ.. ''పాపం చిన్మయి ఎలా ఉందో ఒకసారి కనుక్కో'' అనగా.. వెన్నెల కిషోర్.. ''అవునన్నో.. అటునుండి రెస్పాన్స్ లేదు'' అనగా.. చిన్మయి స్పందిస్తూ.. ''ఇప్పుడే స్పృహ వచ్చింది'' అంటూ రిప్లయ్ చేసింది. వీరి మధ్య జరిగిన ఈ ట్విట్టర్ సంభాషణ ఫన్నీ ఫన్నీగా సాగింది. 

PREV
click me!

Recommended Stories

Hero Karthik: ఆ అలవాటు వల్ల కెరీర్ లో పతనం.. అన్వేషణ హీరో కార్తీక్ ఆరోగ్యం ఆరోగ్య పరిస్థితి ఏంటి ?
55 ఏళ్ల వయసులో 300 సినిమాలు, 200 కోట్లకు పైగా ఆస్తి, స్టార్ డైరెక్టర్ ను పెళ్లాడిన హీరోయిన్ ఎవరు?