ఎన్టీఆర్ ని గుర్తుచేసుకుంటూ.. రాజమౌళి వ్యాఖ్యలు!

Published : Sep 28, 2018, 10:13 AM IST
ఎన్టీఆర్ ని గుర్తుచేసుకుంటూ.. రాజమౌళి వ్యాఖ్యలు!

సారాంశం

హీరోగా ఎన్టీఆర్ చేసింది అప్పటికి ఒక్క సినిమా మాత్రమే.. అతడిని హీరోగా పెట్టి దర్శకుడు రాజమౌళి 'స్టూడెంట్ నం.1' తెరకెక్కించాడు. రాజమౌళికి కూడా అదే మొదటి సినిమా. ఈ సినిమా ఇద్దరూ హిట్ అందుకున్నారు. హీరోగా ఎన్టీఆర్ స్థాయిని పెంచిన సినిమా కూడా అదే.

హీరోగా ఎన్టీఆర్ చేసింది అప్పటికి ఒక్క సినిమా మాత్రమే.. అతడిని హీరోగా పెట్టి దర్శకుడు రాజమౌళి 'స్టూడెంట్ నం.1' తెరకెక్కించాడు. రాజమౌళికి కూడా అదే మొదటి సినిమా. ఈ సినిమా ఇద్దరూ హిట్ అందుకున్నారు. 

హీరోగా ఎన్టీఆర్ స్థాయిని పెంచిన సినిమా కూడా అదే.. ఆ తరువాత వరుస అవకాశాలతో టాప్ రేసులో దూసుకుపోయాడు. రాజమౌళికి 'స్టూడెంట్ నం.1'హిట్ బాగా కలిసొచ్చింది. ఈ సినిమా వచ్చి 17 సంవత్సరాలు పూర్తయ్యాయి. 

ఈ సందర్భంగా అప్పటిరోజులను గుర్తు చేసుకున్న రాజమౌళి సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. 'నా మొదటి సినిమా స్టూడెంట్ నం.1 విడుదలై ఇప్పటికి 17 ఏళ్లు అవుతోంది. ఎన్టీఆర్, నేను ఇప్పటికి కొద్దిగా మెరుగయ్యాం.. సమయం ఎంత వేగంగా గడిచిపోయింది' అంటూ అప్పటిరోజులను గుర్తుచేసుకున్నారు.

ఆ సినిమా తరువాత వీరిద్దరూ కలిసి 'సింహాద్రి', 'యమదొంగ' సినిమాలకు పని చేశారు. ఇప్పుడు రాజమౌళి రూపొందించబోయే.. మల్టీస్టారర్  సినిమాలో ఒక హీరోగా ఎన్టీఆర్ కనిపించనున్నాడు.  

PREV
click me!

Recommended Stories

Vahini Battles Cancer : విషమంగా సీనియర్ నటి ఆరోగ్య పరిస్థితి, సహాయం కోసం ఎదురుచూపులు
Remuneration: సౌత్‌లో అత్యధిక పారితోషికం తీసుకున్న ఒకే ఒక్కడు.. ఆయన ముందు ప్రభాస్, విజయ్‌, అల్లు అర్జున్‌ జుజూబీ