బాలకృష్ణ కోసం పోటీ పడుతున్న నలుగురు డైరెక్టర్లు.. బాలయ్య నెక్ట్స్ సినిమా ఎవరితో..?

Published : Jun 21, 2023, 01:20 PM IST
బాలకృష్ణ కోసం పోటీ పడుతున్న నలుగురు డైరెక్టర్లు.. బాలయ్య నెక్ట్స్ సినిమా ఎవరితో..?

సారాంశం

బాలయ్య బాబు జోరు మామూలుగా లేదు. వరుస సినిమాలు.. వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్న బలయ్య కు డిమాండ్ బారీగా పెరిగిపోయిది. కుర్ర డైరక్టర్లు కూడా బాలయ్యతో సినిమా కోసం క్యూ కడుతున్నారు. మా కథ వినకపోతాడా అని ఎదురు చూస్తున్నారు.  

నందమూరి అభిమానులకు వరుసగా భారీ ట్రీట్లు రెడీ చేస్తున్నాడు బాలకృష్ణ, యంగ్ హీరోలను మించి జోరు చూపిస్తూ.. వరుస సినిమాలతో దడదడలాడిస్తున్నాడు. ఒక సినిమా షూటింగ్ కంప్లీట్ అవ్వకముందే.. మరో సినిమా స్టార్ట్ చేసి.. గ్యాప్ లేకుండా బిజీ అయిపోతున్నడు. ఇక ప్రస్తుతం నందమూరి  అభిమానులంతా భగవంత్ కేసరి' సినిమా కోసం వేయికళ్లతో వెయిట్ చేస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాను, దసరా పండుగ సందర్భంగా విడుదల చేయనున్నారు. ఈ సినిమా షూటింగును పూర్తి చేసుకుంటూ ఉండగానే, బాలయ్య మరో నలుగురు దర్శకులను లైన్లో పెట్టేశారు. 

బాలయ్య తో సినిమా కోసం దాదాపు ఐదారుగురు దర్శకులు ప్రయత్నంచేశారు. ఈక్రమంలో భగవంత్ కేసరి ఆయన మెగా డైరెక్టర్ బాబీకి జై కోట్టాడు. దాంతో అట్టహాసంగా సినిమా ఓపెనింగ్ కూడా చేసేశారు మేకర్స్..  యాక్షన్ ప్రధానంగా నడిచే కథతో.. సితార నాగవంశీ - సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా తరువాత బాలయ్య ఏ సినిమాకు జై కొట్టబోతున్నారు అనేది ఉత్కంటగా మారింది. గతంలో బోయపాటితో  సినిమాకు కమిట్ మెంట్ ఇచ్చాడు బాలయ్య.. దాంతో నెక్ట్స్ బోయపాటితో బాలయ్య సినిమాలు చేస్తుదదా అనేది ఉత్కంఠగా ారింది. 

 ఈ సినిమా, పొలిటికల్ నేపథ్యంలో కొనసాగుతుందని అంటారు. ఇక ఆతరువాత బాలకృష్ణ తో  సినిమా కోసం బింబిసార ఫేమ్  డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వంలో చేయడానికి బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు. బింబిసార తో మంచి పేరు తెచ్చుకున్న ఈ దర్శకుడు, బాలయ్య సినిమాను గీతా ఆర్ట్స్ పై చేయనున్నాడు. ఇక ఆ తరువాత సినిమాను పరశురామ్ దర్శకత్వంలో బాలయ్య చేయనున్నాడని చెబుతున్నారు. ఇలా వరుస సినిమాలతో బాలయ్య యంగ్ హీరోలతో పోటీపడుతుండటం విశేషం.

PREV
click me!

Recommended Stories

తనూజతో రొమాంటిక్ మూమెంట్స్, సంతోషంతో పొంగిపోయిన కళ్యాణ్.. సంజనకి ఓజీ రేంజ్ ఎలివేషన్
ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు