'OG' లో పవన్ పాత్ర పేరు..మరో అదిరిపోయే అప్డేట్ కూడా..

Published : Jun 21, 2023, 12:54 PM ISTUpdated : Jun 21, 2023, 12:55 PM IST
 'OG' లో పవన్ పాత్ర పేరు..మరో  అదిరిపోయే అప్డేట్ కూడా..

సారాంశం

ఈ మూవీ లో పవన్ గ్యాంగ్ స్టార్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. పవన్ ఇది వరకు బాలు , పంజా మూవీ లలో గ్యాంగ్ స్టార్ పాత్రలలో నటించాడు.


పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ వరసగా చేస్తున్న ప్రాజెక్టులలో  #OG ఒకటి.  సాహో దర్శకుడు సుజీత్(Sujeeth) ఈ ప్రాజెక్టుని చాలా స్టైలిష్ గా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.  ఓజీ- ఒరిజినల్ గ్యాంగస్టర్(OG-Original Gangstar) టైటిల్ ఇప్పటికే జనాల్లోకి వెళ్ళిపోయింది.  ఆర్ఆర్ఆర్ నిర్మాత డీవీవీ దానయ్య ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా కోసం పవన్ ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అందుతున్న సమచారం మేరకు డిసెంబర్ లో రిలీజ్...అవుతుంది. 

అలాగే ఈ చిత్రం షూటింగ్ అప్డేట్స్ విషయానికి వస్తే.. జులై నాటికి పవన్ కళ్యాణ్ అవసరం లేని పోర్షన్లు పూర్తి అయిపోతాయి.  ఈ సినిమాలో ఇప్పుడు పవన్ లేని పోర్షన్స్ షూటింగ్ జరుగుతున్నాయట. ప్రస్తుతం ముంబై లో ప్రీ ఇంటర్వెల్ కి సంబంధించి కొన్ని కీలక సీక్వెన్స్ లను దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్నాడని సమాచారం. ఇక మరికొన్ని రోజుల్లో పవన్ కూడా జాయిన్ కానున్నాడు.

 ఆగష్టు లో పవన్ కళ్యాణ్  పది రోజులిస్తారని దాంతో  షూటింగ్ పూర్తవుతుందని చెప్తున్నారు. మరో ప్రక్కఈ చిత్రంలో పవన్ పాత్ర పేరు గాంధీ అని తెలుస్తోంది.  క్యారక్టర్ పరంగా చూస్తేనేమో గ్యాంగస్టర్ ..కానీ గాంధీ పేరు పెట్టడంతో ..అసలు ఈ చిత్రంలో పవన్ అసలు పాత్ర ఏంటి? ఎలాంటి లుక్‌లో కనిపిస్తారు? అనే చర్చ జరుగుతోంది.  
 
గ్యాంగస్టర్ డ్రామా గా జరిగే ఈ చిత్రం ఓ ట్విస్ట్ తో నడవనుంది.   ఓ రకంగా ఇది సుజీత్ కు ఛాలెంజింగ్ మూవీ, ప్రభాస్ తో చేసిన సాహో మూవీ పరాజయం తర్వాత సుజీత్ అదిరిపోయే రీతిలో రీ ఎంట్రీ ఇవ్వాలని అనుకున్నాడు. తనను తాను నిరూపించుకోవాలని అనుకుని చేసిన స్క్రిప్టు ఇది.   పవన్ సినిమా తనకు వచ్చిన గోల్డెన్ ఆఫర్ గా భావించి స్క్రిప్టుపై బాగా వర్కౌట్ చేశాడని చెప్తున్నారు.  ఈ మూవీ లో పవన్ గ్యాంగ్ స్టార్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. పవన్ ఇది వరకు బాలు , పంజా మూవీ లలో గ్యాంగ్ స్టార్ పాత్రలలో నటించాడు.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

తనూజతో రొమాంటిక్ మూమెంట్స్, సంతోషంతో పొంగిపోయిన కళ్యాణ్.. సంజనకి ఓజీ రేంజ్ ఎలివేషన్
ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు