నాగ్ కూడా మంగళవారం అనడు కదా..

Published : Jun 21, 2023, 01:04 PM ISTUpdated : Jun 21, 2023, 01:06 PM IST
నాగ్ కూడా మంగళవారం అనడు కదా..

సారాంశం

కింగ్ అక్కినేని నాగార్జున లాస్ట్ మూవీ ‘ది ఘోస్ట్’ బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఫెయిల్ అయ్యింది. 


కంటెంట్ ఉన్న సినిమాగా కొత్తవాళ్లతో వచ్చిన  ‘Rx 100’అప్పట్లో మంచి సక్సెస్ అయ్యింది.  ముఖ్యంగా యువప్రేక్షకులకు సినిమా బాగా నచ్చింది. 
 అజయ్ భూపతి. రాంగోపాల్ వర్మ శిష్యుడు. మొదటి సినిమాతోనే తెలుగు సినీపరిశ్రమలో చర్చకు తెరతీశారు అజయ్ భూపతి. గ్రామస్థాయి పాలిటిక్స్, గ్రామాల్లో ప్రేమికుల మధ్య ఉండే నాటు సరసం, భావోద్వేగాలను ఒడిసిపట్టుకోవడంతో యూత్‌కి బాగా కనెక్ట్ అయ్యింది ఈ మూవీ. కార్తీకేయ, పాయల్ రాజ్‌పుత్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ మూవీపై తాజాగా ఈ మూవీపై ప్రశంసల జల్లు కురిసింది.
 
లిప్ లాక్ సీన్లతోనే సినిమా మొత్తం భారీ విజయాన్ని సాధించింది. ఈ సినిమాను కుర్రాళ్లు రెండుమూడుసార్లు చూశారు. దర్శక,నిర్మాతల అంచనాలను మించి సినిమాను ప్రేక్షకులు ఆదరించారు. తక్కువ బడ్జెట్‌తో చిన్న చిత్రంగా విడుదలైన ఈ మూవీ సన్సేషనల్ హిట్‌ను సాధించింది. మొదట్లో బూతు చిత్రంగా విపరీతమయిన ప్రచారం చేసినప్పటికీ ఫైనల్‌‌గా సగటు ప్రేక్షకుడు సినిమాకి అఖండ విజయాన్ని అందించాడు. 

బడ్జెట్ తక్కువే అయినా ఈ మూవీ తిరుగులేని కలెక్షన్లతో నిర్మాతలకు కాసుల వర్షం కురిపించటంతో ఈ దర్శకుడుకు బాగానే ఆఫర్స్ వచ్చాయి . కానీ ఆ తర్వాత వచ్చిన మహా సముద్రం డిజాస్టర్ కావటంతో అందరూ భయపడిపోయారు. ఏ హీరో డేట్స్ ఇవ్వటానికి ఉత్సాహం చూపించలేదు. ఈ నేపధ్యంలో మంగళవారం అంటూ ఓ సినిమా తెరకెక్కించి రిలీజ్ కు రెడీ చేసారు అజయ్ భూపతి. ఆ తర్వాత నెక్ట్స్ నాగ్ తో సినిమా చేసారని సమాచారం. అయితే మంగళవారం కథ అయితే కాదు అంటున్నారు. 

 కింగ్ అక్కినేని నాగార్జున లాస్ట్ మూవీ ‘ది ఘోస్ట్’ బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఫెయిల్ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు ప్రవీణ్ సత్తారు తెరకెక్కించగా, పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా ఈ సినిమా రూపొందింది. యాక్షన్ డోస్ ఎక్కువగా ఉన్నప్పటికీ, ఈ సినిమా ప్రేక్షకులను ఇంప్రెస్ చేయలేకపోయింది. దీంతో తన నెక్ట్స్ మూవీని ఎలాగైనా హిట్ చేయాలని నాగ్ ప్రయత్నిస్తున్నాడు. 
 
ఈ సినిమాని అన్నపూర్ణ స్టూడియోస్, కష్టడీ నిర్మాత శ్రీనివాస చిట్టూరి కలిసి నిర్మించనున్నారు. యాక్షన్ తో కూడిన కథాంశం అని తెలుస్తోంది. గతంలో రవితేజ కోసం తయారు చేసిన కథ ఇది అని..దానికి కొద్ది పాటి మార్పులు చేర్పులతో నాగ్ కు చెప్పి ఒప్పించారని వినికిడి. త్వరలో ఎనౌన్సమెంట్ వచ్చే అవకాసం ఉంది.
 

PREV
click me!

Recommended Stories

తనూజతో రొమాంటిక్ మూమెంట్స్, సంతోషంతో పొంగిపోయిన కళ్యాణ్.. సంజనకి ఓజీ రేంజ్ ఎలివేషన్
ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు