వరుస పరాజయాలతో సతమతమవుతోన్న అఖిల్‌కు ఈ సినిమా హిట్ అవ్వడం ఎంతో కీలకంగా మారింది. అటు బొమ్మరిల్లు భాస్కర్ కెరీర్ కి కూడా ఈ సినిమా విజయం చాలా కీలకం. ఈ సినిమాలో అఖిల్ పూజా హెగ్డే మధ్య కెమిస్ట్రీ చాలా బాగా కుదిరింది.. వీరి మధ్య రొమాన్స్ సినిమాలోనే హైలెట్‌గా నిలిచింది.
దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ కు తెలుగు పరిశ్రమలో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఎంతలా అంటే వరస డిజాస్టర్స్ ఇచ్చినా ఆయన నెక్ట్స్ సినిమాకు ఎంత గ్యాప్ వచ్చినా ఎదురు చూసేటంత. ఇక ఆయన హీరో అఖిల్ అయితే కెరీర్ లో ఒక్క హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఇప్పుడాయన దర్శకత్వంలో అఖిల్ హీరోగా తెరకెక్కించిన చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ ఆ ఎదురుచూపులకు సమాధానం చెప్పినట్లే అయ్యింది. బన్నీవాసు, వాసు వర్మ నిర్మించారు. పూజా హెగ్డే హీరోయిన్. ఈ సినిమా ఇటీవలే విడుదలైంది. చాలా కాలం తర్వాత అఖిల్ సినిమాకు కలెక్షన్స్ కనపడుతున్నాయి. ఫస్ట్ వీకెండ్ ని డీసెంట్ గా లాగుతున్నాడు.
‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ కు మిక్సెడ్ టాక్ వచ్చినా ప్రామిసింగ్ కలెక్షన్స్ తోనే ముందుకు వెళ్తోంది. రిలీజ్ రోజు తెలుగు రెండు రాష్ట్రాల్లో ఈ సినిమా ఐదు కోట్లు దాకా వసూలు చేసినట్లు సమాచారం. అఖిల్ కెరీర్ లో ఇది బెస్ట్ ఓపినింగ్. తొలి చిత్రం తర్వాత ఓపినింగ్స్ ఈ స్దాయిలో రావటం జరిగింది. అలాగే రెండో రోజు కూడా ఎక్కడా డ్రాప్ లేదు. నైజాంలో అయితే రెండో రోజు కలెక్షన్స్ చూసి ట్రేడ్ ఆశ్చర్యపోయేలా ఉన్నాయి. ఇదే ట్రెండ్ అన్ని చోట్లా కొనసాగిందని చెప్తున్నారు. ఈ రోజు ఆదివారం కూడా అదే సిట్యువేషన్ కనపడుతోంది. మల్టిప్లెక్స్ లు అడ్వాన్స్ బుక్కింగ్ తో ఫిల్ అయ్యాయి. ఫ్యామిలీలకు ఈ సినిమా పట్టేటట్లే కనపడుతోంది. కొన్ని కొత్త స్క్రీన్స్ కూడా యాడ్ అవుతున్నాయి. త్వరలోనే ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ బ్రేక్ ఈవెన్ వచ్చే అవకాసం ఉంది.
undefined
Also read అఖిల్, పూజా హెగ్డే `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్` ట్విట్టర్ టాక్..
బొమ్మరిల్లు భాస్కర్ మాట్లాడుతూ... ‘‘ప్రతి పెళ్లి వేడుకలా జరుగుతుంది. అయితే పెళ్లి తర్వాత ఎలా బతకాలి అన్న విషయంలో ఎవరికీ స్పష్టత ఉండదు. అసలు వివాహం తర్వాత కాపురం సాఫీగా సాగడానికి కావాల్సిన అర్హతలేంటి? అన్నది మనకు తెలియదు. ఈ అంశాన్ని ఓ ఆసక్తికర కథనంగా చెప్పాలి.. అదీ సున్నితమైన వినోదంతో ఆకట్టుకునేలా చూపించాలి అన్న ఉద్దేశంతో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ చేశాం. మనలో ఉన్న ఓ ఎమోషన్‌ని మనసులో ఉన్న ఓ వ్యక్తికి చెప్పాలనుకున్నప్పుడు.. ఆ టైమ్‌కి వాళ్లు రాకపోతే కలిగే బాధని వర్ణించలేము. ఆ బాధ ఎలా ఉంటుందనేది దీంట్లో ఆసక్తికరంగా చూపించాం. దీనికి అఖిల్, పూజా హెగ్డే తమదైన నటనతో ప్రాణం పోశారు’’ అన్నారు.
Also read ఆయన నెంబర్ ని 'గాడ్ ఫాదర్' అని సేవ్ చేసుకున్నా,వైయస్ జగన్ కు ధాంక్స్: అఖిల్