జ్యోతిష్యుడిగా సునీల్.. ముగ్గురు మహిళల కథతో 'హెడ్స్ అండ్ టేల్స్', ట్రైలర్ ఇదిగో

pratap reddy   | Asianet News
Published : Oct 16, 2021, 08:55 PM IST
జ్యోతిష్యుడిగా సునీల్.. ముగ్గురు మహిళల కథతో 'హెడ్స్ అండ్ టేల్స్', ట్రైలర్ ఇదిగో

సారాంశం

ఓటిటి వచ్చాక తక్కువ బడ్జెట్ లో వైవిధ్యమైన కథలకు ప్రాధాన్యత దక్కుతోంది. వెబ్ సిరీస్ ల రూపంలో అద్భుతమైన కథలు ప్రేక్షకులని అలరిస్తున్నాయి. కొత్త నటీనటులకు అవకాశాలు పెరుగుతున్నాయి.

ఓటిటి వచ్చాక తక్కువ బడ్జెట్ లో వైవిధ్యమైన కథలకు ప్రాధాన్యత దక్కుతోంది. వెబ్ సిరీస్ ల రూపంలో అద్భుతమైన కథలు ప్రేక్షకులని అలరిస్తున్నాయి. కొత్త నటీనటులకు అవకాశాలు పెరుగుతున్నాయి. ఆ కోవకు చెందినదే ' హెడ్స్ అండ్ టేల్స్' వెబ్ సిరీస్. అక్టోబర్ 22 నుంచి ఈ వెబ్ సిరీస్ జీ5లో స్ట్రీమింగ్ కానుంది. 

తాజాగా Heads and Tales ట్రైలర్ విడుదల చేశారు. ఈ వెబ్ సిరీస్ లో Sunil జ్యోతిష్యుడిగా నటిస్తున్నాడు. ముగ్గురు అమ్మాయిల తలరాతలు, వారి జీవితాలు ఒకసారి చూడు అంటూ సునీల్ చెబుతుండగా ట్రైలర్ ప్రారంభం అవుతుంది. నటిగా అవకాశాల కోసం ప్రయత్నిచే ఓ యువతి, కానిస్టేబుల్ పనిచేసే యువతి, లవర్ తో ఎంజాయ్ చేసే మరో యువతి పాత్రల్లో శ్రీవిద్య, దివ్య, చాందిని రావు నటించారు. 

ఈ ముగ్గురు యువతులు తమ లైఫ్ లో ఎదురైన కష్టాలని ఎలా అధికమించారు అనేదే ఈ వెబ్ సిరీస్ కథ. ఇక కమెడియన్ సుహాస్ కీలక పాత్రలో నటించాడు. కలర్ ఫోటో చిత్రానికి పని చేసిన టీం ఈ వెబ్ సిరీస్ కి కూడా పనిచేస్తోంది. 

ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. సాయికృష్ణ ఎండ్రెడ్డి ఈ వెబ్ సిరీస్ కు దర్శకత్వం వహించగా..మణిశర్మ సంగీతం అందించారు. రమ్య క్రియేషన్స్, పాకెట్ మని పిక్చర్స్ సంస్థలు ఈ వెబ్ సిరీస్ ని నిర్మించాయి. 

 

PREV
click me!

Recommended Stories

ఆ డైరెక్టర్ ఫోన్ చేసి ఐదుగురితో కమిట్‌మెంట్ అడిగాడు.. టాలీవుడ్ నటి ఓపెన్ స్టేట్‌మెంట్
నాగార్జున ఫ్లాప్ మూవీ గురించి చెప్పిన డైరెక్టర్, నయనతారకి సర్ప్రైజ్.. అందుకే చిరంజీవి సినిమాకి ఒప్పుకుందా