విశ్వక్ సేన్ ‘ధమ్కీ’ నుంచి లవ్ సాంగ్.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ సింగిల్ లిరికల్ వీడియో!

Published : Dec 06, 2022, 06:21 PM IST
విశ్వక్ సేన్  ‘ధమ్కీ’ నుంచి లవ్ సాంగ్.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ సింగిల్ లిరికల్ వీడియో!

సారాంశం

యంగ్ హీరో విశ్వ‌క్‌సేన్ న‌టిస్తున్న తాజా చిత్రం ‘ధ‌మ్కీ’. రొమాంటిక్ కామెడీ, యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపుదిద్దుకుంటోంది.  మూవీ నుంచి తాజాగా ఫస్ట్ సింగిల్ విడుదలై ఆకట్టుకుంటోంది.  

వరుస చిత్రాలతో అలరిస్తూ టాలీవుడ్ లో క్రేజీ స్టార్ గా ఎదుగుతున్నారు యంగ్ హీరో విశ్వక్ సేన్. ఇప్పటికే మాస్ కా దాస్ ట్యాగ్ ను సొంతం చేసుకున్న ఈ హీరో ఇటు రొమాంటిక్ డ్రామాతోనూ ఆకట్టుకుంటున్నారు. విశ్వక్ సేన్ (Vishwak Sen) తాజాగా నటిస్తున్న చిత్రం ‘దాస్ కా ధమ్కీ’ (Das Ka Dhamki). శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం నుంచి క్రేజీ అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. 

ఇప్పటికే సాలిడ్ ట్రైలర్ ను వదలడంతో సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యింది. తాజాగా క్రేజీ సాంగ్ ను విడుదల చేశారు. రెండ్రోజులు ఆలస్యంగా వచ్చిన ‘ధమ్కీ ఫస్ట్ సింగిల్’ యూత్ ను ఆకట్టుకునేలా ఉంది. ‘ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్ల’ టైటిల్ తో తొలిపాటను విడుదల చేశారు. క్రేజీ లిరిక్స్, అదిరిపోయే కొరియోగ్రఫీ.. అద్భుతమైన లోకేషన్లలో సాంగ్ షూట్ చేయడంతో సాంగ్ హిట్ ట్రాక్ గా నిలుస్తుందని పిస్తోంది. విశ్వక్ సేన్, హీరోయిన్ నివేదా పేతురాజ్ కెమిస్ట్రీ కూడా ఆకట్టుకుంటోంది. తెలుగుతో పాటు హిందీలోనూ ఒకేసారి ఫస్ట్ సింగిల్ విడుదల చేయడం విశేషం.

తెలుగు పాటకు పూర్ణచారి సాహిత్యం అందించారు. లియోన్ జేమ్స్, ఆదిత్య ఆర్కే ఆలపించారు. లియోన్ జేమ్స్ క్యాచీ ట్యూన్ అందించారు. కొరియోగ్రాఫర్ యశ్ మాస్టర్ అదిరిపోయే స్టెప్పులేయించడం సాంగ్ ను మరో స్థాయికి తీసుకెళ్లింది. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్ లో దూసుకుపోతోంది. ఈ సినిమాను వన్మయే క్రియేషన్స్, విశ్వక్ సేన్ సినిమాస్ బ్యానర్ల పై విశ్వ‌క్‌సేన్ ఫాద‌ర్ క‌రాటే రాజు నిర్మిస్తోన్నారు. విశ్వక్ సేన్, నివేదా పేతురాజ్ (Nivedha Pethuraj) జంటగా నటిస్తున్నారు. రావు రమేష్‌, హైపర్‌ ఆది, రోహిణి, పృథ్వీరాజ్‌ కీలక పాత్రల్లో అలరించనున్నారు. లియోన్ జేమ్స్ సంగీతాన్ని అందిస్తున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 17న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.

PREV
click me!

Recommended Stories

Akhanda 2: అఖండ 2 సంక్రాంతికి వస్తే ఎవరికి నష్టం ? ఒకవైపు ప్రభాస్, మరోవైపు చిరంజీవి.. జరిగేది ఇదే
Prabhas: దేశముదురు దెబ్బకి అడ్రస్ లేకుండా పోయిన ప్రభాస్ సినిమా..ఒకే ఏడాది బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్