మహేశ్ బాబు కొత్త బిజినెస్.. ప్రముఖ సంస్థతో కలిసి రెస్టారెంట్ ఏర్పాటు.. రెండ్రోజుల్లో గ్రాండ్ ఓపెనింగ్!

Published : Dec 06, 2022, 05:35 PM ISTUpdated : Dec 06, 2022, 05:37 PM IST
మహేశ్ బాబు కొత్త బిజినెస్.. ప్రముఖ సంస్థతో కలిసి రెస్టారెంట్ ఏర్పాటు.. రెండ్రోజుల్లో గ్రాండ్ ఓపెనింగ్!

సారాంశం

వరుస సినిమాలతో బిజీగా ఉంటున్న సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu).. మరోవైపు పలు రకాల బిజినెస్ లపైనా ఫోకప్ చేస్తున్నారు. రెండ్రోజుల్లో మహేశ్ బాబు కొత్త వ్యాపారం హైదరాబాద్ లోనే ప్రారంభం కాబోతోంది.  

సూపర్ స్టార్ మహేశ్ బాబు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉంటున్నారు. మున్ముందు పాన్ ఇండియా చిత్రాలను రిలీజ్ చేసేందుకు సిద్ధం అవుతున్నారు. ప్రస్తుతం మాటల మాంత్రికుడు  త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంతో నటిస్తున్నారు. ‘ఎస్ఎస్ఎంబీ28’వర్క్ టైటిల్ తో సినిమా షూటింగ్ కొనసాగుతోంది. ఇటీవల తండ్రి క్రిష్ణ మరణించడంతో కొంత గ్యాప్ వచ్చింది. త్వరలోనే మళ్లీ పునఃప్రారంభం కానుంది. ఈ చిత్రం తర్వాత దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో నటించనున్నారు. 

సినిమాలతో ఇటు బిజీగా ఉంటూ.. మరోవైపు పలు రకాల బిజినెస్ లపైనా ఫోకస్ పెడుతున్నారు. ఇప్పటికే ప్రొడక్షన్ కంపెనీ, ఏఎంబీ థియేటర్, క్లాత్ బ్రాంబ్ బిజి నెస్ ఉన్న విషయం తెలిసిందే. ఈ బిజినెస్ లను ఎక్కువ శాతం భార్య నమ్రతా శిరోద్కర్ (Namratha Shirodkar) చూసుకుంటుంది.  ఈసారి మరో బిగ్ ప్లాన్ వేశారు. మహేశ్ బాబు.. భార్య పేరు మీద మంచి డిమాండ్ ఉన్న హోటల్ బిజినెస్ లోకి అడుగుపెడుతున్నారు. ఇందుకోసం  ఓ సంస్థతో కలిసి వ్యాపారాన్ని ప్రారంభిస్తున్నారు.

స్టార్ కపుల్ సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్ తాజాగా రెస్టారెంట్ వ్యాపారంలోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఇందుకోసం ఏషియన్ గ్రూప్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నారు. ఏషియన్ సునీల్ నారంగ్ , భరత్ నారంగ్‌లతో కలిసి ‘AN రెస్టారెంట్స్’ అనే పేరుతో బిజినెస్ ను ప్రారంభిస్తున్నారు. 'AN రెస్టారెంట్లు’ మినర్వా కాఫీ షాప్ ను డిసెంబర్ 8న గ్రాండ్ గా ఓపెనింగ్ చేయనున్నారు. బంజారాహిల్స్‌లోని రోడ్: 12లో గల నీరా టవర్స్‌లో ఈ రెస్టారెంట్ ఫస్ట్ బ్రాంచ్ ను ప్రారంభించబోతున్నారు. మరోవైపు ఏషియనల్ ప్యాలెస్ హైట్స్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. 

 

PREV
click me!

Recommended Stories

Chiranjeevi: చిరంజీవితో నటించి సెలెబ్రిటీలని పెళ్లి చేసుకున్న హీరోయిన్లు వీళ్ళే..సుహాసిని నుంచి జ్యోతిక వరకు
Akhanda 2: అఖండ 2 సంక్రాంతికి వస్తే ఎవరికి నష్టం ? ఒకవైపు ప్రభాస్, మరోవైపు చిరంజీవి.. జరిగేది ఇదే