హీరోయిన్స్ పై లైంగిక వేధింపులు, హేమ కమిటీ సంచలన రిపోర్ట్... ఇండస్ట్రీ ప్రతినిధుల షాకింగ్ రెస్పాన్స్!

మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులు, అన్యాయాలను జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్ తెరపైకి తెచ్చింది. ఈ రిపోర్ట్ పై ఎట్టకేలకు మలయాళ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ స్పందించింది. ఈ మేరకు కీలక కామెంట్స్ చేసింది. 
 


మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లను ప్రస్తావిస్తూ కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 19న   విడుదల చేసిన హేమ కమిటీ నివేదికపై అసోసియేషన్ ఆఫ్ మలయాళ మూవీ ఆర్టిస్ట్స్ (AMMA) స్పందించింది.  ఆగస్టు 23 శుక్రవారం AMMA  జనరల్ సెక్రటరీ సిద్ధిఖీ మాట్లాడుతూ..  మలయాళ చిత్ర పరిశ్రమపై హేమా కమిటీ రూపొందించిన రిపోర్ట్ తాము స్వాగతిస్తున్నట్లు చెప్పారు.

సిద్దిఖీ మీడియాతో మాట్లాడుతూ...  AMMA  సభ్యుల స్టేట్మెంట్స్ ఆధారంగా రూపొందించిన నివేదికలోని అంశాలను సిద్ధిఖీ అంగీకరించారు. హేమ కమిటీ సూచించిన ప్రతిపాదనలకు తమ సంఘం పూర్తి మద్దతు ఇస్తుందని ఆయన స్పష్టం చేశారు. అయితే మహిళపై జరుగుతున్న లైంగిక దాడులు, వేధింపులకు మొత్తం మలయాళ చిత్ర పరిశ్రమను నిందించడం సరికాదని ఆయన అన్నారు. ఈ అంశాన్ని అంగీకరించమని తెలియజేశారు. 

Latest Videos

"హేమా కమిటీ సిఫార్సులను మేము స్వాగతిస్తున్నాము. రెండు సంవత్సరాల క్రితం మంత్రి సాజీ చెరియన్ నివేదిక సిఫార్సులపై చర్చించడానికి సమావేశం ఏర్పాటు చేశారు. నేను, ఏడవెల బాబు సమావేశంలో పాల్గొని, మా సూచనలను ఆయనతో పంచుకున్నాము" అని సిద్ధిఖీ మీడియా సమావేశంలో తెలియజేశారు. 

"హేమా కమిటీ రిపోర్ట్ కి AMMA  వ్యతిరేకం కాదు. కమిటీ తన రిపోర్ట్ లో ఎక్కడా AMMA ను తప్పుబట్టలేదు. మేము హేమా కమిటీ రిపోర్ట్ కి మద్దతు ఇస్తున్నాము. కానీ మీడియా మమ్మల్ని నిందితులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తుంది, ఇది దురదృష్టకరం" అని సిద్ధిఖీ అన్నారు. తప్పు చేసిన వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. కేవలం కొన్ని సంఘటలను పరిగణలోకి తీసుకుని మొత్తం చిత్ర పరిశ్రమను దూషించవద్దని హెచ్చరించారు.

పరిశ్రమలో పవర్ గ్రూప్ ఉందనే ఆరోపణలను ఆయన ఖండించారు. తన వ్యక్తిగత అనుభవం, పరిజ్ఞానం ఆధారంగా ఈ వాదనను తిరస్కరించారు. రెండు సంవత్సరాల క్రితం ఒక హైపవర్ కమిటీ ఏర్పాటైందని అంగీకరించిన ఆయన, చిత్ర పరిశ్రమలో మరే ఇతర పవర్ గ్రూప్ లేదా మాఫియా ఉన్నట్లు ఆధారాలు లేవని నొక్కి చెప్పారు.

"2006 సంఘటన గురించి గతంలో ఫిర్యాదు అందింది. దీనిపై ఏ చర్య తీసుకోవచ్చో ఆలోచిస్తాము. AMMA కు  అందిన ఏకైక ఫిర్యాదు అది" అని ఆయన అన్నారు. "మా సభ్యుల్లో చాలా మందిని హేమా కమిటీ కలవలేదు. మమ్ముట్టి, మోహన్‌లాల్ మూడు, నాలుగు సార్లు కమిటీ ముందు హాజరయ్యారు. వారిని ఎక్కువగా రెమ్యూనరేషన్, పేమెంట్ కి సంబంధించిన సమస్యల గురించే అడిగారు.

గత సమావేశాల్లో నివేదికలోని అంశాలను ప్రభుత్వం వెల్లడించలేదని సిద్ధిఖీ అన్నారు. కాగా నటుడు దిలీప్‌పై 2017లో నమోదైన లైంగిక వేధింపుల కేసు నేపథ్యంలో జస్టిస్ కె. హేమ కమిషన్ ఏర్పాటైంది. మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళపై జరుగుతున్న లైంగిక వేధింపులు, వివక్షను ఈ కమిషన్ దర్యాప్తు చేయాల్సి ఉంది. హేమ రిపోర్ట్ దిగ్భ్రాంతికర విషయాలు వెల్లడించింది. దేశంలోనే అత్యధికంగా మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళపై లైంగిక వేధింపులు, దాడులు జరుగుతున్నాయని హేమ కమిటీ రిపోర్ట్ తేల్చింది. 

సుదీర్ఘకాలం జస్టిస్ హేమ కమిటీ రీసెర్చ్ చేసింది. పరిశ్రమకు చెందిన పలువురు మహిళలను ఈ కమిటీ సభ్యులు కలిసి సమాచారం సేకరించారు. మలయాళ చిత్ర పరిశ్రమ ఒక మాఫీయా కనుసన్నల్లో నడుస్తుంది. కాస్టింగ్ కౌచ్ కి పాల్పడుతున్నారు. మహిళలు తమపై జరిగే లైంగిక దాడులపై మాట్లాడటం లేదు. వారిలో భయం, అభద్రతా భావం ఉంది. కమిట్మెంట్ కి అంగీకరించే హీరోయిన్స్ ని ఒక కేటగిరీగా విభజించారంటూ... హేమ కమిటీ రిపోర్ట్ లో పేర్కొంది. 

తనపై లైంగిక వేధింపులకు పాల్పడిన హీరోతో ఓ హీరోయిన్ హగ్ సీన్ చేయాల్సి రాగా అతడు 17 టేకులు తీసుకున్నాడని హేమ కమిటీ రిపోర్ట్ లో తెలిపింది. ఇలాంటి ఎన్నో భయానక విషయాలు కమిటీ తెరపైకి తెచ్చింది. హేమ కమిటీ రిపోర్ట్ మహిళల రక్షణ, అభివృద్ధికి కొన్ని సూచనలు చేసింది. 
 

click me!