ట్రోలింగ్ భరించలేక ఇన్స్టాగ్రామ్ ఖాతా డిలీట్ చేసిన నాగార్జున హీరోయిన్.. ఏం జరిగిందంటే..

By tirumala AN  |  First Published Aug 23, 2024, 4:35 PM IST

సోషల్ మీడియా వల్ల సెలెబ్రిటీలు తరచుగా ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు. ముఖ్యంగా హీరోయిన్లు తరచుగా ట్రోలింగ్ కి గురవుతున్నారు. 


సోషల్ మీడియా వల్ల సెలెబ్రిటీలు తరచుగా ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు. ముఖ్యంగా హీరోయిన్లు తరచుగా ట్రోలింగ్ కి గురవుతున్నారు. కింగ్ నాగార్జున నటించిన సూపర్ చిత్రంతో బాలీవుడ్ నటి అయేషా టకియా హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. 

సూపర్ చిత్రం యావరేజ్ కావడంతో అయేషా టకియాకి ఆ తర్వాత ఆఫర్స్ రాలేదు. దీనితో అయేషా టకియా కొన్ని బాలీవుడ్ చిత్రాల్లో మాత్రమే నటించింది. 2009లో అయేషా పెళ్లి చేసుకుని వైవాహిక జీవితాన్ని ప్రారంభించింది. 

Latest Videos

అయితే అయేషా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న తర్వాత గుర్తు పట్టలేని విధంగా మారిపోయింది. దీనితో అయేషా ఎక్కడ కనిపించినా ఆమె ఫోటోలు వైరల్ అవుతుంటాయి. ఇటీవల అయేషా ఎయిర్ పోర్ట్ లో తన కొడుకుతో కనిపించింది. అయేషా ఈ లుక్ లో పూర్తిగా మారిపోయి కనిపిస్తోంది. 

ఆ ఫోటోని నెటిజన్లు తెగ వైరల్ చేస్తూ ఈమె అసలు అయేషా నేనా అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఆమెపై బాడీ షేమింగ్ కి పాల్పడుతున్నారు. దీనితో అయేషా ట్రోలింగ్ భరించలేక ఏకంగా తన ఇంస్టాగ్రామ్ ఖాతానే డిలీట్ చేసేసింది. అంతలా ఆమెని నెటిజన్లు భయపెట్టేశారు. ఆ రేంజ్ లో ట్రోలింగ్ జరిగింది మరి. 

click me!