స్కూల్‌కి బంక్ కొడుతున్న సితార.. కారణం అతడే.. మహేష్‌బాబు కూతురులో సీక్రెట్‌ యాంగిల్‌

By Aithagoni Raju  |  First Published Aug 23, 2024, 5:11 PM IST

మహేష్‌ బాబు కూతురు సితార పెద్ద షాకిచ్చింది. ఆమె స్కూల్‌కి బంక్‌ కొడుతుంది. ఇటవల కాలంలో చాలా సార్లు స్కూల్‌కి బంక్ కొట్టిందట. అయితే దానికి కారణం ఎవరో బయటపెట్టడం విశేషం. 
 


సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు కూతురు సితార.. చిన్నప్పుడే సెలబ్రిటీ అయిపోయింది. స్టార్‌ కిడ్‌గా స్టార్‌ స్టేటస్‌ని పొందింది. ఆమె ఆ మధ్య జ్యూవెల్లరీ యాడ్‌లో నటించి మరింత పాపులర్‌ అయ్యింది. స్టార్‌ కిడ్‌ గా స్టార్‌ స్టేటస్‌ ని అనుభవిస్తున్న అమ్మాయిగా సితార నిలవడం విశేషం. ఓ వైపు స్టడీస్‌ చేస్తూనే మరోవైపు అడపాదడపా ఈవెంట్లలో మెరుస్తుంది. 

సితార చిన్న వయసులోనే స్టార్‌ స్టేటస్‌ని అనుభవిస్తున్నవారిలో అరుదైన స్టార్‌ కిడ్‌గా నిలిచింది. ఈ విషయంలో ఆమె సరికొత్త రికార్డుని సృష్టించింది. మరోవైపు సొంతంగా యూట్యూబ్‌ ఛానెల్‌ని రన్‌ చేస్తుంది సితార. తన ఫ్రెండ్స్ తో కలిసి గేమ్స్ వీడియోలు, ఫన్నీ వీడియోలు, చిన్న చిన్న యాక్టివిటీస్ చేస్తూ ఆకట్టుకుంటుంది. మరోవైపు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలను పంచుకుంటూ ఫ్యాన్స్ ని అలరిస్తుంది. చిన్న ఏజ్‌లోనే ఇంతటి పనులు చేస్తూ ప్రత్యేకంగా నిలుస్తుంది సితార ఘట్టమనేని. 

Latest Videos

సితార ప్రస్తుతం ఏడో తరగతి చదువుతున్నట్టు తెలుస్తుంది. అయితే ఆమె స్కూల్‌కి మాత్రం చాలాసార్లు బంక్ కొడుతుందట. దీనికి సంబంధించిన రహస్యాన్ని బయటపెట్టింది సితార. తాజాగా ఆమె ఐడ్రీమ్‌ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో స్కూల్‌ కి బంక్‌ కొట్టే మ్యాటర్‌ని లీక్‌ చేసింది సితార. ఎప్పుడైనా స్కూల్‌కి బంక్‌కొట్టావా అని యాంకర్‌ అడగ్గా, చాలా సార్లు బంక్‌ కొట్టానని, అయితే దానికి కారణం మాత్రం డాడీ(మహేష్‌ బాబు)నే అని తెలిపింది. చాలా సార్లు డాడీ వల్లే బంక్‌ కొట్టాల్సి వచ్చిందని చెప్పి ఆశ్చర్యపరిచింది. 

సితార అంటే మహేష్‌ కి చాలా ఇష్టం. తన గారాల పట్టి. ఆమె క్యూట్‌నెస్‌కి, ముద్దు ముద్దు మాటలను చూసి మురిసిపోతుంటాడు మహేష్‌. ఆమె తెలివికి హ్యాట్రాప్‌ చెబుతూ, సితార పాపని భరించడం చాలా కష్టం అని, చాలా టఫ్‌ అంటూ చాలా సందర్భాల్లో తెలిపారు. అయితే మహేష్‌ బాబు సినిమాల షూటింగ్‌లో గ్యాప్‌ దొరికితే విదేశాలకు వెళ్లిపోతాడు. వెకేషన్‌కి వెళ్తుంటారు. బహుశా ఈ కారణాలతో స్కూల్‌కి బంక్‌ కొట్టాల్సి వస్తుందేమో, లేక తనతో ఆడుకోవాల్సి రావడం వల్ల ఇలా చేయాల్సి వస్తుందేమో. దీనికి సంబంధించిన సితార ఏం చెబుతుందనేది ఆసక్తికరంగా మారింది. 

ఇక మహేష్‌ బాబు ప్రస్తుతం.. రాజమౌళితో సినిమా చేయబోతున్నారు. `ఎస్‌ఎస్‌ఎంబీ29` పేరుతో ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ వర్క్ జరుగుతుంది. త్వరలోనే ఈ మూవీ ప్రారంభం కాబోతుందని తెలుస్తుంది. ఈ సినిమా కోసం మహేష్‌ కొత్త లుక్‌లోకి మారిపోయారు. ఆయన మేకోవర్‌ వేరే రేంజ్‌లో ఉంది. హాలీవుడ్‌ హీరోని తలపిస్తున్నారు. మరి సినిమా ఏ రేంజ్‌లో ఉంటుందో చూడాలి. 
 

click me!