Nitya Menen:ప్రభాస్ ఇష్యూతో నిజాయితీగా ఉండకూడదని అర్థమైంది... నిత్యా మీనన్ షాకింగ్ కామెంట్స్

Published : Dec 12, 2021, 08:02 AM ISTUpdated : Dec 12, 2021, 08:03 AM IST
Nitya Menen:ప్రభాస్ ఇష్యూతో నిజాయితీగా ఉండకూడదని అర్థమైంది... నిత్యా మీనన్ షాకింగ్ కామెంట్స్

సారాంశం

కెరీర్ బిగినింగ్ లో నిత్యా మీనన్ ఓ వివాదంలో చిక్కుకున్నారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిత్యా మీనన్ ని ప్రభాస్ (Prabhas) గురించి అడుగగా... ఆయన గురించి నాకు తెలియదు అన్నారు. నిత్యా మీనన్ చేసిన ఈ కామెంట్ అప్పట్లో వివాదం రగిలించింది.

చేసింది తక్కువ చిత్రాలే అయినా నిత్యా మీనన్ (Nitya Menen) కి తెలుగులో భారీ ఫాలోయింగ్ ఉంది. స్టార్ హీరోయిన్ కాకపోయినా ఆమెకంటూ సపరేట్ ఇమేజ్ సొంతం చేసుకుంది. మంచి యాక్టర్ గా ప్రూవ్ చేసుకున్న నిత్యా మీనన్, సౌత్ ఇండియాలో అన్ని భాషల్లో నటించారు. ఇక మిషన్ మంగళ్ మూవీతో హిందీలో కూడా అడుగుపెట్టారు. అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కిన ఆ మూవీలో స్పేస్ సైంటిస్ట్ గా నటించారు. 


కాగా కెరీర్ బిగినింగ్ లో నిత్యా మీనన్ ఓ వివాదంలో చిక్కుకున్నారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిత్యా మీనన్ ని ప్రభాస్ (Prabhas) గురించి అడుగగా... ఆయన గురించి నాకు తెలియదు అన్నారు. నిత్యా మీనన్ చేసిన ఈ కామెంట్ అప్పట్లో వివాదం రగిలించింది. మీడియాలో ఈ విషయం హైలెట్ కావడంతో, ఫ్యాన్స్ నిత్యా మీనన్ పై మండిపడ్డారు. ఈ సంఘటన బాహుబలి సిరీస్ కి ముందు జరిగినప్పటికీ, అప్పటికే ప్రభాస్ టాలీవుడ్ లో స్టార్ హీరోలలో ఒకరిగా ఉన్నారు. 


అయితే ఈ సంఘటన తనను ఎంతగానో బాధ పెట్టినట్లు నిత్యా మీనన్ తెలియజేశారు. ఈ సంఘటన జరిగి దాదాపు దశాబ్దం అవుతుండగా... నిత్యా మీనన్ స్పందించారు. ఆమె మాట్లాడుతూ... ‘నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో తెలుగు సినిమాలు పెద్దగా చూడలేదు. నాకు తెలుగు సరిగా వచ్చేది కాదు. అందుకే టాలీవుడ్‌ సినిమాలు చూసేదాన్నికాదు. అదే సమయంలో నన్ను ప్రభాస్ గురించి అడిగారు…నాకు తెలియదని చెప్పాను. ఆ విషయాన్ని పెద్దది చేశారు. నా అమాయకత్వాన్ని ఉపయోగించుకున్నారు. నేను ఏదో పెద్ద తప్పు చేసినట్టుగా న్యూస్ క్రియేట్ చేశారు. జర్నలిస్టులు నా గురించి అలా రాయడంతో చాలా హర్ట్‌ అయ్యాను. ఆ ఇష్యూతో నిజాయితీగా అన్ని చోట్ల ఉండకూడదని,ఎక్కడా ఎలా ఉండాలో అలాగే ఉండాలని అర్థమైంది. ప్రభాస్‌ ఇష్యూ నన్ను ఇప్పటికి బాధ పెడుతుంది’అని నిత్యా చెప్పుకొచ్చింది.


టాలీవుడ్ పరిశ్రమపై అప్పటికి అవగాహన లేకపోవడంతో ప్రభాస్ గురించి అలా మాట్లాడానని నిత్యా మీనన్ తన కామెంట్స్ ని సమర్ధించుకున్నారు. అదే సమయంలో తెలియని విషయాన్ని నిజాయితీగా చెప్పినందుకు ఇలాంటి సమస్య ఏర్పడింది. కాబట్టి అన్ని సందర్భాల్లో నిజాయితీగా ఉండకూడదని, పరిస్థితులకు అనుకూలంగా డిప్లొమాటిక్ గా మాట్లాడాలని  నిత్యా తన అభిప్రాయపడ్డారు. 

Also read Project K: ప్రభాస్‌-దీపికా పదుకొనె వరల్డ్ బిగ్గెస్ట్ మూవీ స్టార్ట్.. ఫస్ట్ షాట్ చూశారా?
నిత్యా నటించిన స్కైలాబ్ ఇటీవల విడుదలైంది. ఈ సినిమాకు ఆమె నిర్మాత కూడా కావడం విశేషం. మరోవైపు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)కి జంటగా ఆమె భీమ్లా నాయక్ (Bheemla nayak)మూవీలో నటిస్తున్నారు. భీమ్లా నాయక్ సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. 

Alsor read Prabhas: 200కోట్లతో ప్రభాస్‌ కొత్తిళ్లు.. ఇంద్రభవనం తలపించేలా?

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రీతూ, సంజనాల డ్రామాలు కళ్లకి కట్టినట్టు చూపించిన బిగ్‌ బాస్‌.. కళ్యాణ్‌ ఫస్ట్‌ ఫైనలిస్ట్
Anasuya: నేనేమీ సాధువును కాదు.. ఇలా మాట్లాడటం నాకూ వచ్చు