Bigg Boss Telugu 5: సన్నీ సెకండ్‌ ఫైనలిస్ట్.. ఇంటి సభ్యుల రిగ్రెట్స్ అవే..

Published : Dec 11, 2021, 11:19 PM IST
Bigg Boss Telugu 5: సన్నీ సెకండ్‌ ఫైనలిస్ట్.. ఇంటి సభ్యుల రిగ్రెట్స్ అవే..

సారాంశం

అందులో భాగంగా రెగ్రెట్స్ చెబుతూ, మొదట కాజల్‌ 9వ వారం రిగ్రెట్‌ ఉందని చెప్పింది. జైల్‌ నామినేషన్‌.. సన్నీ, మానస్‌లను సేవ్‌ చేయాల్సింది. కానీ చేయలేదనే బాధ ఉందని తెలిపింది. షణ్ముఖ్‌ తనకు 11వ వారంలో రిగ్రెట్‌ ఉందన్నారు.

బిగ్‌బాస్‌ తెలుగు 5(Bigg Boss Telugu 5) షో.. చివరి దశకు చేరుకుంది. 14వ వారం కూడా పూర్తి కావస్తుంది. ఇంకా జస్ట్ ఒక్క వారం మాత్రమే ఉంది. ఇక డైరెక్ట్ గా విన్నర్స్ ని ఎంపిక చేయడం మాత్రమే ఉంటుంది. అయితే ఇక ఈ శనివారానికి సంబంధించిన ఎపిసోడ్‌(98వ ఎపిసోడ్‌) చూస్తే ఈ రోజు..హోస్ట్ నాగార్జున గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చారు. ఇంటి సభ్యులకు ఈ సీజన్‌ మొత్తంలో ఉన్న రిగ్రెట్స్ ఏంటో చెప్పించాడు. తర్వాత హిట్‌ ఎవరు, ఫ్లాప్‌ ఎవరో చెప్పించారు. మరోవైపు తమ పొజిషియన్స్ ని డిసైడ్‌ చేయించారు. 

అందులో భాగంగా రెగ్రెట్స్ చెబుతూ, మొదట కాజల్‌ 9వ వారం రిగ్రెట్‌ ఉందని చెప్పింది. జైల్‌ నామినేషన్‌.. సన్నీ, మానస్‌లను సేవ్‌ చేయాల్సింది. కానీ చేయలేదనే బాధ ఉందని తెలిపింది. షణ్ముఖ్‌ తనకు 11వ వారంలో రిగ్రెట్‌ ఉందన్నారు. ఆ వారంలో సిరితో జరిగిన వివాదానికి సంబంధించిన విషయంలో తనే బాధ్యుడిని అని, అలా చేయకుండా ఉండాల్సింది అని తెలిపారు. సన్నీకి12 వీక్‌లో రిగ్రెట్‌ ఉందన్నారు. ఆ వారంలో ఐస్‌కి సంబంధించి టాస్క్ లో తాను అలా చేయకుండా ఉండాల్సింది. నా వల్ల అలా జరిగిందని బాధపడ్డట్టు తెలిపారు. మానస్‌ నాల్గో వారం రిగ్రెట్‌ ఉందని, ఆ వారం సన్నీకి సపోర్ట్ గా లేకపోయాననే బాధ ఉందన్నారు. 

శ్రీరామ్‌.. తనకు 4వ వారం రిగ్రెట్‌ ఉందని చెప్పాడు. తాను కెప్టెన్‌ అయ్యానని, ఆ వీక్‌ మిర్చి ఇచ్చాను, అది నా లైఫ్‌నే మార్చింది. ఎవరి వంట వారు చేసుకోవాలని చెప్పడం కరెక్ట్ కాదని చెప్పింది. సిరి చెబుతూ, తనకు 11 వ వారం రిగ్రెట్‌ ఉందని చెప్పింది. షణ్ముఖ్‌తో జరిగిన ఇష్యూలో బాత్‌రూమ్‌లో తల బాదుకోవడం బాధగా అనిపించింది. అలా చేయకుండా ఉండాల్సిందనిపించిందని సిరి తెలిపింది. ఆ తర్వాత ఈ సీజన్‌లో హిట్‌ ఎవరు, ఫ్లాప్‌ ఎవరు అనేది చెప్పాలని తెలిపారు నాగ్‌. 

ఇందులో కాజల్‌.. తనకు సన్నీ హిట్‌ అని, షణ్ముఖ్‌ ఫ్లాప్‌ అని తెలిపింది. శ్రీరామ్‌.. తనకు సన్నీ హిట్‌ అని, కాజల్‌ ఫ్లాప్‌ అని చెప్పాడు. సన్నీ(Sunny) చెబుతూ, తనకు మానస్‌ హిట్‌ అని, సిరి ఫ్లాప్‌ అని చెప్పాడు. సిరి చెబుతూ, షణ్ముఖ్‌ హిట్‌ అని, సన్నీ ఫ్లాప్‌ అని తెలిపింది. మానస్‌ చెబుతూ, సన్నీ హిట్‌ అని, షణ్ముఖ్‌ ఫ్లాప్‌ అని తెలిపాడు. షణ్ముఖ్‌.. సిరి హిట్‌ అని, కాజల్‌ ఫ్లాప్‌ అని తెలిపారు. అయితే ఎక్కువ ఓట్లతో సన్నీ హిట్‌ అయ్యాడని చెప్పొచ్చు. అనంతరం ఇంటి సభ్యులకు సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు నాగ్‌. బిగ్‌బాస్‌ సీజన్‌ 5లో సెకండ్‌ ఫైనలిస్ట్ ఎవరో తేల్చారు. శ్రీరామ్‌ మొదటి ఫైనలిస్ట్ అయిన విషయం తెలిసిందే. గార్డెన్‌ ఏరియాలో ఉన్న బెలూన్స్ లో సెకండ్‌ ఫైనలిస్ట్ ఫోటో ఉంటుంది. దాన్ని లాగి ఫోటో చూశాడు శ్రీరామ్‌. సెకండ్‌ ఫైనలిస్ట్ గా సన్నీ నిలిచారని తెలిపారు. 

అనంతరం ఈ సీజన్‌లో ఇప్పుడున్న సభ్యులు ఎవరు ఏ పొజిషియన్‌కి అర్హులో చెప్పాలన్నారు. ఆ పొజిషియన్‌ నిర్ణయించుకుని తమ స్థానాల్లో నిల్చోవాలని తెలపగా, అందుకోసం బాగా డిస్కషన్‌ జరిగింది. అనేక వాదనలు, ఓటింగ్‌ తర్వాత ఫైనల్‌గా సిరి ఫస్ట్ పొజిషియన్‌, శ్రీరామ్‌ రెండో స్థానం, కాజల్‌ మూడో స్థానం, షణ్ముఖ్‌ నాల్గో స్థానం, సన్నీ ఐదో స్థానం దక్కించుకోగా, మానస్‌ ఆరో స్థానం దక్కింది. అయితే తమ పొజిషియన్ల విషయంలో సభ్యులకే క్లారిటీ లేకపోతే, ఆడియెన్స్ కి ఏం ఉంటుంది, అది వారిని టెస్టింగ్‌ కోసం చేసినట్టు తెలిపారు నాగ్‌. రేపు ఈ వారం ఎలిమినేట్‌ అయ్యేది ఎవరు, ఫైనలిస్ట్ అయ్యే ఐదుగురు ఎవరనేది తెలుస్తుందన్నారు. ప్రస్తుతం ఉన్న వారిలో శ్రీరామ్‌ ఫస్ట్ ఫైనలిస్ట్ కాగా, సన్నీ రెండో ఫైనలిస్ట్ గా నిలిచారు. మానస్‌, సిరి, కాజల్‌, షణ్ముఖ్‌లో ఎవరు ఎలిమినేట్‌ అవుతారనేది ఆసక్తి నెలకొంది. అయితే ఈ వారం కాజల్‌ ఎలిమినేట్‌ అవుతుందని తెలుస్తుంది. 

also read: Pooja Hegde: వణికే చలిలో చెమటలు పట్టిస్తున్న పూజా.. పైటకొంగు పక్కకు జరిపి అందాల బ్లాస్టింగ్‌

also read: Kajal Eliminated: ఈ సీజన్‌ చివరి ఎలిమినేషన్‌ కాజల్‌.. టాప్‌ 5 వారేనా?
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రీతూ, సంజనాల డ్రామాలు కళ్లకి కట్టినట్టు చూపించిన బిగ్‌ బాస్‌.. కళ్యాణ్‌ ఫస్ట్‌ ఫైనలిస్ట్
Anasuya: నేనేమీ సాధువును కాదు.. ఇలా మాట్లాడటం నాకూ వచ్చు