
లైగర్ మూవీ నిన్న విడుదలై డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఈ లోపు అనసూయ ఖాతాలో ఓ ట్వీట్ వెలిసింది. అమ్మను తిట్టిన వాళ్లకు ఇలాగే జరుగుతుందని ఆమె కామెంట్ చేశారు. ఈ కామెంట్ లైగర్ మూవీ గురించేనని నెటిజెన్స్ అభిప్రాయం. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అనసూయను ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. ఆమెపై బాడీ షేమింగ్ కి పాల్పడుతున్నారు. ఈ క్రమంలో అనసూయ సోషల్ మీడియా వేదికగా వాళ్లకు సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు.
అంటీ అంటూ తిడుతూ నన్ను అవమానించిన ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకుంటాను. మీ బూతులు, ఏజ్ గురించి కామెంట్ చేసిన వారి స్క్రీన్ షాట్స్ తీసి లీగల్ గా చేయాల్సింది చేస్తానని హెచ్చరించారు. ఈసారి తనను ట్రోల్ చేసేవాళ్లకు గట్టిగానే బుద్ధి చెప్పాలని ఆమె డిసైడ్ అయ్యారని తెలుస్తుంది.
Here by..taking screenshot of every account abusing me..age shaming me by calling“Aunty”..involving my family into this and I will file a case and take it to a point where you will regret getting to me without any legit reason..this is my final warning..
ఇక ఈ వివాదం ఇప్పటిది కాదు. అర్జున్ రెడ్డి మూవీలో విజయ్ చెప్పిన ఓ డైలాగ్ వివాదాస్పదమైంది. మాధర్*** అని విజయ్ పలికిన డైలాగ్ ని అనసూయ తప్పుబట్టింది. అమ్మను అంత మాట అంటారా అని స్టూడియోస్ లో కూర్చొని పెద్ద పెద్ద డిబేట్స్ నడిపారు. సినిమా నుండి ఆ డైలాగ్ తొలగించాలి. అలాగే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అనసూయ డిమాండ్స్, డిబేట్స్ విజయ్ దేవరకొండ చాలా లైట్ గా తీసుకున్నాడు. మరి అప్పటి ఈ వివాదాన్ని అనసూయ ఇంకా మర్చిపోలేదనేది నెటిజెన్స్ అభిప్రాయం. విజయ్ దేవరకొండ నటించిన లైగర్ సినిమాను విమర్శిస్తూ అనసూయ ఆ ట్వీట్ చేశారని అంటున్నారు.
ఇండస్ట్రీలో ఉంటూ ఒక సినిమా ఫెయిల్యూర్ ని సెలెబ్రేట్ చేసుకోవడం ఎంత వరకు కరెక్ట్ అని ఓ నెటిజెన్ ప్రశ్నించగా అనసూయ సమాధానం చెప్పారు. ఇండస్ట్రీలో ఉంటూ డబ్బులిచ్చి నన్ను మాదర్*** అనిపించడం ఎంత వరకు కరెక్ట్ అండి? నా ప్లేస్ లో మీరు ఉంటే ఆ బాధ మీకు తెలిసి ఉండేది. మీరు క్షమించగలరా? అని ఎదురు ప్రశ్నించారు. పరోక్షంగా అనసూయ లైగర్ చిత్రానికి ప్లాప్ టాక్ రావడం ఎంజాయ్ చేస్తున్నట్లు ఒప్పుకున్నారు.
Industry lo untu dabbulichi oka woman and mother and thoti actor pai Ma******d ani anipinchadam enta varaku correct andi?? Na place lo unte meeru enni eellaina marchipogalara?? Kshaminchagalara?? https://t.co/uIxIbACzTj
అనసూయ మదిలో ఏముందో తెలియదు కానీ, ఆమె ట్వీట్ వివాదాస్పదమైంది. ఇక నేడు ఆమె నెటిజెన్స్ తో ఛాట్ చేశారు. తనను అభిమానించేవారికి, విమర్శిస్తున్న వాళ్లకు నేరుగా సమాధానం చెబుతున్నారు. ఎప్పుడూ వివాదాల్లో ఉండే అనసూయ మరో వివాదంలో వేలు పెట్టినట్లు అనిపిస్తున్నారు.