గుండెపోటుతో ప్రముఖ దర్శకుడు మృతి.. నివాళి అర్పిస్తున్న సినీ ప్రముఖులు..

Published : Aug 26, 2022, 01:40 PM IST
గుండెపోటుతో ప్రముఖ దర్శకుడు మృతి.. నివాళి అర్పిస్తున్న సినీ ప్రముఖులు..

సారాంశం

తమిళ చిత్ర పరిశ్రమలో తాజాగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రముఖ దర్శకుడు మణి నాగరాజ్ (Mani Nagaraj) ప్రాణాలు కోల్పోవడం సినీ ప్రముఖులను దిగ్బ్రాంతికి గురిచేస్తోంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని నివాళి అర్పిస్తున్నారు.   

తమిళ దర్శకుడు మణి నాగరాజు నిన్న ఉదయం గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో చిత్ర పరిశ్రమలో విషాధ ఛాయలు అలుముకున్నాయి. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయనకు ఉన్నట్టుండి స్టోక్ రావడంతో తుదిశ్వాస విడిచారు. మణి నాగరాజు చైన్నైలోనే నివాసం ఉంటుండగా.. తన నివాసంలోనే మరణించినట్టు తెలుస్తోంది. ఈ రోజు బంధువులు, అభిమానులు, సినీ ప్రముఖుల సంతాపనంతరం అంత్యక్రియలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 

ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సోషల్ మీడియాలో వేదికన నివాళి అర్పిస్తున్నారు. ఆయన స్నేహితులు, అభిమానులు కూడా ఈ విషయాన్ని జీర్ణించుకోలేపోతున్నారు. ఇంటర్నెట్ ద్వారా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన స్వర్గస్తులవ్వాలని దేవుడిని ప్రార్థిస్తున్నారు.  మణి నాగరాజ్ మృతి పట్ల నటుడు, మ్యూజిక్ కంపోజర్ జీవీ ప్రకాష్ కుమార్ (G.V Prakash Kumar) నివాళి అర్పించారు.  ఈ సందర్భంగా ఎమోషనల్ నోట్ రాశారు. ‘నా ప్రియ మిత్రుడు, దర్శకుడు మణి నాగరాజ్ ఇకలేరంటే నమ్మడం కష్టంగా ఉంది. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని వేడుకుంటున్నాను’ అంటూ ట్వీట్ చేశాడు. జీవీ ప్రకాశ్ - మణి నాగరాజు దర్శకత్వంలో ‘పెన్సిల్’ సినిమా వచ్చింది. 

 

అలాగే లిరిసిస్ట్ పార్వతి కూడా మణి నాగరాజ్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. ‘పెన్సిల్ డైరెక్టర్ మణి నాగరాజ్ మరణించడ పట్ల చింతిస్తున్నాను.  ఆయన కుటుంబ సభ్యుల పట్ల సానుభూతిని వ్యక్తం చేస్తున్నాను’ అంటూ ట్వీట్ చేసింది. అలాగే ప్రముఖ ఫిల్మ్ ఎడిటర్  టీఎస్ సురేష్ (TS Suresh) కూడా స్పందించారు. ‘గౌతమ్ వాసుదేవ్ మీనన్ మాజీ అసోసియేట్, సినిమా దర్శకుడు మణి నాగరాజ్ మరణవార్త తెలిసి దిగ్భ్రాంతికి, బాధకు గురయ్యాను. పోస్ట్‌ ప్రొడక్షన్‌ కు సంబంధించిన ప్రాథమిక అంశాలను నాకు నేర్పింది ఆయనే. నాకు మంచి స్నేహితుడు, గొప్ప ఉపాధ్యాయుడు. ఇంత త్వరగా వెళ్లిపోవడం బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను’ అంటూ ట్వీట్ చేశాడు.  

 

 

దర్శకుడు మణి నాగరాజ్ 2016లో జివి ప్రకాష్ పెన్సిల్‌తో డైరెక్టర్ గా తమిళ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. అంతకు ముందు దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్‌కి మాజీ అసోసియేట్ గా పనిచేశారు. ‘పెన్సిల్’ చిత్రం తర్వాత దర్శకుడిగా మారి ప్రత్యేక గుర్తింపు పొందాడు. తన రాబోయే చిత్రం ‘వాసువిన్ గర్బినీగల్’ విడుదలకు సిద్ధమవుతోంది. జేవియర్ బ్రిట్టో నిర్మించిన ఈ చిత్రం మలయాళం చిత్రం ‘జచరియాయుడే గర్భినికల్‌’కి తమిళ రీమేక్. మూవీలో నానా గోపీనాథ్, సీత, వనితా విజయకుమార్, అనిఖా సురేంద్రన్ ప్రధాన పాత్రలు పోషించారు. వచ్చే ఏఢాది 2023లో చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. 

PREV
click me!

Recommended Stories

Akhanda 2: అఖండ 2 రిలీజ్ కి తొలగిన అడ్డంకులు, మద్రాస్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. కానీ ఆ ఒక్క సమస్య ఇంకా ఉంది
Prabhas in Japan: జపాన్ లో భూకంపం నుంచి ప్రభాస్ సేఫ్.. హమ్మయ్య, రెబల్ స్టార్ కి గండం తప్పింది