రోడ్డు ప్రమాదానికి గురైన కత్తి మహేష్.. ఆసుపత్రిలో చికిత్స!

Published : Jun 26, 2021, 10:44 AM ISTUpdated : Jun 26, 2021, 02:02 PM IST
రోడ్డు ప్రమాదానికి గురైన కత్తి మహేష్.. ఆసుపత్రిలో చికిత్స!

సారాంశం

కత్తి మహేష్ నెల్లూరు జిల్లా, కొడవలూరు మండలం, చంద్రశేఖర్ పురం జాతీయ రహదారిపై ఇన్నోవా కారులో ప్రయాణిస్తున్నారు. ఈ సమయంలో ప్రమాదవశాత్తు ఆయన కారు లారీని ఢీకొట్టింది.   

నటుడు, ఫిల్మ్ క్రిటిక్ కత్తి మహేష్  ఘోర రోడ్డు ప్రమాదంలో చిక్కుకున్నారు. ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో కత్తి కత్తి మహేష్ కి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తుంది. కత్తి మహేష్ నెల్లూరు జిల్లా, కొడవలూరు మండలం, చంద్రశేఖర్ పురం జాతీయ రహదారిపై ఇన్నోవా కారులో ప్రయాణిస్తున్నారు. ఈ సమయంలో ప్రమాదవశాత్తు ఆయన కారు వెనుక నుండి లారీని ఢీకొట్టింది. 
 

ఈ ప్రమాదం జరిగిన వెంటనే కత్తి మహేష్ ని నెల్లూరు మెడికేర్ హాస్పిటల్ లో చేర్చడం జరిగింది. అయితే ఈ ప్రమాదంలో కత్తి మహేష్ కి బలమైన గాయాలు తగిలినట్లు సమాచారం. ప్రస్తుతం చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం పట్ల బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన తలకు గాయాలు కావడం ఆందోళన కలిగిస్తుంది. 


ఇక పవన్ కళ్యాణ్ పై అనేక విమర్శలు చేసిన కత్తి మహేష్ వివాదాలతో చాలా పాప్యులర్ అయ్యారు. కాటమరాయుడు మూవీకి నెగిటివ్ రివ్యూ ఇచ్చిన కత్తి మహేష్ పై పవన్ ఫ్యాన్స్ దాడికి దిగడం జరిగింది. అలాగే రామాయణం పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కత్తి మహేష్ గతంలో నగర బహిష్కరణకు గురికావడం జరిగింది.  

PREV
click me!

Recommended Stories

Gunde Ninda Gudi Gantalu Today Episode: ప్రభావతి చేసిన కుట్ర, బాలు వద్ద అడ్డంగా దొరికిపోయినా మీనా
ప్రభాస్‌తో చేసిన సినిమాల్లో అనుష్కకు నచ్చిన సినిమా ఏంటో తెలుసా.? అది భలే ఇష్టమట..