బాలీవుడ్ చిత్రం 'అందాధున్' తెలుగు రీమేక్‌లో నితిన్ హీరోగా నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తెలుగులో మాస్ట్రో అనే టైటిల్ తో తెరకెక్కుతోంది.
రూమర్స్ నిజమయ్యాయి. నితిన్ తాజా చిత్రంగా 'మాస్ట్రో' థియోటర్ రిలీజ్ స్క్రిప్ అయ్యింది. ఈ సినిమా ఓటీటీ, శాటిలైట్ థియేట్రికల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ+హాట్ స్టార్, స్టార్ గ్రూప్ సొంతం చేసుకుంది. అన్ని హక్కుల కోసం.. భారీ మొత్తం చేతులు మారిందని సమాచారం. దాంతో హాట్ స్టార్ ఓటీటి ప్లాట్ ఫామ్ పై ఈ సినిమా డైరక్ట్ స్ట్రీమింగ్ కు రానుంది. తెలుగులో పేరున్న హీరో సినిమా ఓటీటిలో వస్తే వ్యూస్ ఎలా ఉంటాయని ఇండస్ట్రీ మొత్తం ఆసక్తి గా చూస్తుంది. ఈ విషయమై అధికారిక ప్రకటన అయితే లేదు ఇప్పటిదాకా. త్వరలో రావచ్చు అంటున్నారు. అయితే నితిన్ ..తొలి నాటి నుంచి థియోటర్ రిలీజ్ కే మ్రొగ్గు చూపుతున్నాడని, దీనకి ఎలా ఓకే చేసాడని కొందరు సందేహం వెళ్లబుచ్చుతున్నారు.
అయితే ఆగస్ట్ నాటికి థియేటర్లు ఓపెన్ అయితే సినిమా విడుదల చేయాలని.. లేదంటే.. ఓటీటీలోకి తీసుకెళ్లాలని భావిస్తున్నారట మేకర్స్. ఇక వచ్చే నెల జూలైలో పరిస్థితుల్ని బట్టి తుది నిర్ణయం తీసుకునే అవకాశమున్నట్లుగా తెలుస్తోంది.
ఆ మధ్య హిందీలో హిట్ కొట్టిన 'అంధాదున్' సినిమాకి ఇది రీమేక్. తెలుగులో మేర్లపాక గాంధీ ఈ సినిమాను పట్టాలెక్కించాడు. నితిన్ సరసన హీరోయిన్ గా నభా నటేశ్ అలరించనుండగా, హిందీలో 'టబు' చేసిన పాత్రను తమన్నా చేసింది. మహతి స్వరసాగర్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి హరి కె. వేదాంత్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. డైలాగ్స్-డైరెక్షన్: మేర్లపాక గాంధీ, నిర్మాతలు: ఎన్. సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి, బ్యానర్: శ్రేష్ఠ్ మూవీస్.
గత ఏడాది భీష్మ సినిమాకు ముందు ఏడాదిన్నర పాటు సినిమాలేమీ చేయని నితిన్.. తర్వాత వరస సినిమాలను లైన్‌లో పెట్టాడు.ఈలోగా కోవిడ్ దెబ్బతో సినీ ఇండస్ట్రీ ఆగింది. ఆ ప్రభావం తగ్గి...థియేటర్స్ ఓపెన్ అయిన తర్వాత చెక్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. ఈ సినిమా ఆశించినంత మేరకు విజయాన్ని సాధించలేదు.చెక్ తర్వాత నితిన్ చేసిన మరో సినిమా రంగ్ దే విడుదలైంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వర్కవుట్ కాలేదు.