శేఖర్ కమ్ముల, ధనుష్ చిత్రం లవ్ స్టోరీ కాదు..మరి?

By Surya PrakashFirst Published Jun 26, 2021, 10:26 AM IST
Highlights

 శేఖర్ కమ్ముల ఏ తరహా కథతో ధనుష్ ని చూపబోతున్నారనేది తమిళ,తెలుగు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఆయనకు కలిసొచ్చిన లవ్ జానర్ లోనే సినిమా చేస్తాడని వార్తలు వస్తున్న నేపధ్యంతో తాజాగా వచ్చిన మరో వార్త వచ్చి అందరనీ ఆశ్చర్యపరిచింది.

క్లాసిక్‌ ప్రేమకథా చిత్రాలకు టాలీవుడ్‌లో కేరాఫ్‌ అడ్రస్‌ గా నిలిచిన ప్రముఖ దర్శకుడు శేఖర్‌కమ్ముల డైరెక్షన్‌లో ధనుష్‌ తన తదుపరి చిత్రాన్ని చేయనున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ప్రకటన కూడా వచ్చింది. ఈ నేపధ్యంలో శేఖర్ కమ్ముల ఏ తరహా కథతో ధనుష్ ని చూపబోతున్నారనేది తమిళ,తెలుగు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఆయనకు కలిసొచ్చిన లవ్ జానర్ లోనే సినిమా చేస్తాడని వార్తలు వస్తున్న నేపధ్యంతో తాజాగా వచ్చిన మరో వార్త వచ్చి అందరనీ ఆశ్చర్యపరిచింది.

అందుతున్న సమాచారం మేరకు ... తమిళనాడు రాజకీయాలతో ముడిపడిన ఓ యథార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కబోతుందని వినిపిస్తోంది. అందుకే వెంటనే ధనుష్ గ్రీన్ సిగ్న ల్ ఇచ్చాచరట. అయితే  ఇది కమర్షియల్ ఫార్మాట్ లో వెళ్ళే  సినిమా అంటున్నారు. ఇక శేఖర్ కమ్ముల పొలిటికల్ డ్రామా అనగానే రానా లాంచింగ్ సినిమాగా చేసిన లీడర్ గుర్తొస్తుంది. ఆ సినిమాకి యాక్షన్ కలిపితే...ఓ చిన్న ఊళ్లో కుర్రాడు తనదైన ఆశయాలు,ఆలచనలు,ఆశలతో పెద్ద పొలిటీషిన్ ఎలా అయ్యాడు. యూత్ రాజకీయాల్లోకి వస్తే ఎంతటి లాభం ఉంటుంది అనేది చూపిస్తాడంటున్నారు. ఈ మేరకు స్క్రిప్టు వర్క్ జరుగుతోందని వినికిడి.  

ఇక ధనుష్ కూడా ఈ చిత్రం గురించి చాలా ఆసక్తిగా ఉన్నారు. తాను ఆరాధించే దర్శకులలో శేఖర్ కమ్ముల ఒకరని, ఆయనతో కలిసి పని చేయడం ఎగ్జైటింగ్ గా ఉందని తెలుపుతూ ఇటీవలే ట్వీట్ కూడా చేశారు. ఈ  సినిమా కోసం నిర్మాతలు దాదాపు 120 కోట్లు బడ్జెట్ కేటాయించనున్నారని అంటున్నారు. అంటే శేఖర్ కమ్ముల రెమ్యునేషన్ కూడా బాగా పెరగనుందన్నమాట.

ఇదే నిజమైతే శేఖర్ కమ్ముల ఫస్ట్ భారీ బడ్జెట్ మూవీ ఇదే అవుతుంది.శేఖర్ కమ్ముల ఇంతకుముందు వరకూ తెరకెక్కించిన చిత్రాలన్నీ తక్కువ బడ్జెట్ లేదా మిడ్ రేంజ్ బడ్జెట్ లోవే.  అయితే ఈసారి హీరో ధనుష్, అంతేకాకుండా ఇది త్రిభాషా చిత్రం కావడంతో ఈ వార్తలు నిజమేనని అన్పిస్తుంది. మరి ఈ వార్తల్లో ఎంతమేరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ బ్యానర్‌పై రూపుదిద్దుకోనున్న ఈ చిత్రానికి నారాయణ్‌ దాస్‌ నారంగ్‌, రామ్మోహన్‌రావు నిర్మాతలుగా వ్యవహరించనున్నారు.

ప్రస్తుతం ధనుష్ చేతిలో ‘అత్రాంగి రే’, ‘ది గ్రే మ్యాన్‌’ ప్రాజెక్టులున్నాయి. సెకండ్‌వేవ్‌ కారణంగా వాయిదా పడిన ఆ సినిమా షూటింగ్స్‌ తిరిగి త్వరలోనే పట్టాలెక్కనున్నాయి. మరోవైపు, శేఖర్‌కమ్ముల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన ‘లవ్‌స్టోరీ’ షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్నారు. ‘లవ్‌స్టోరీ’ విడుదల తర్వాత శేఖర్‌కమ్ముల-ధనుష్‌ ప్రాజెక్ట్‌ పట్టాలెక్కే అవకాశం ఉన్నట్లు సమాచారం.

click me!