'అరవింద సమేత'.. ఎన్టీఆర్ ఫైట్ సీన్ లీక్!

Published : Sep 22, 2018, 05:52 PM ISTUpdated : Sep 22, 2018, 05:57 PM IST
'అరవింద సమేత'.. ఎన్టీఆర్ ఫైట్ సీన్ లీక్!

సారాంశం

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ 'అరవింద సమేత' సినిమా తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. దసరా కానుకగా అక్టోబర్ 11న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ 'అరవింద సమేత' సినిమా తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. దసరా కానుకగా అక్టోబర్ 11న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం సినిమా షూటింగ్ ఓ పక్క జరుగుతుండగానే మరోపక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేస్తున్నారు.

ఇప్పుడు సినిమాలో ఓ పాట కోసం చిత్రబృందం విదేశాలకు వెళ్లబోతుందని టాక్. ఈ పాటను సస్పెన్స్ గా ఉంచబోతున్నారట. గతంలో ఈ సినిమా షూటింగ్ స్పాట్ నుండి కొన్ని ఫోటోలు లీక్ అయిన సంగతి తెలిసిందే. ఓ సన్నివేశానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.

ఎన్టీఆర్ తన తండ్రితో కలిసి కార్ లో వెళ్తుండగా.. ప్రత్యర్ధులు ఎటాక్ చేసే సన్నివేశమది. తాజాగా దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఎవరో ఔత్సాహికులు మానిటర్ లో ఉన్న ఫైట్ సీన్ ని సెల్ ఫోన్ లో రికార్డ్ చేశారు. అది కాస్త బయటకి లీక్ చేశారు.

ఎలాంటి ఎఫెక్ట్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లేకుండానే ఈ ఫైట్ సీన్ ఆకట్టుకుంటోంది. ఫైట్ చివర్లో ఎన్టీఆర్ ఎంట్రీ ఇచ్చే సీన్ లో చాలా కసిగా, కోపంగా కనిపిస్తున్నాడు. హారికా హాసిని బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.  

ఇవి కూడా చదవండి.. 

హృదయాన్ని తాకే 'పెనివిటి' పాట @'అరవింద సమేత'!

'అరవింద సమేత'.. రోమాంచనాలు, హృదయ ప్రకంపనాలు!

PREV
click me!

Recommended Stories

Illu Illalu Pillalu Today Episode Jan 1: విశ్వక్‌ను ఇంట్లోంచి రోడ్డు మీదకు ఈడ్చుకొచ్చిన ప్రేమ, చంపేస్తానంటూ వార్నింగ్
Gunde Ninda Gudi Gantalu: రోహిణీ కొడుకు బర్త్ డే కి వెళ్లిన బాలు, మీనా.. రోహిణీ బాగోతం బయటపడినట్లేనా